
ఎరువుల కొరత తీర్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే..
గోదావరిఖని: ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను ప్రారంభించి తెలంగాణ వ్యవసాయ రంగంలో ఎరువుల కొరత తీర్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కిందని ఆ పార్టీ జి ల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. స్థానిక 28వ డివిజన్ హనుమాన్ దేవాలయం ఆవరణలో అమ్మపేరుతో మంగళవారం ఆయన మొక్క నాటా రు. అనంతరం మాట్లాడారు. నాయకులు గుండబోయిన భూమయ్య, కోమల మహేశ్, ముస్కుల భాస్కర్‌రెడ్డి, ఐత పవన్‌కుమార్, అపర్ణ, సిలివెరీ అంజి, కల్లేపల్లి శ్రీనివాస్, మాదరబోయిన రాకేశ్, ఆకాశ్‌గౌడ్, పల్లె రాజయ్య, పల్లె లింగయ్య, మేకల శ్రీనివాస్, కల్లేపల్లి తిరుపతి, సుశీల, సుమిత్ర, కిష్టమ్మ, స్వాతి, సుజాత తదితరులు పాల్గొన్నారు.
సహజ సంపదను దోచుకుంటున్న కాంగ్రెస్
ఓదెల(పెద్దపల్లి): గ్రామాల్లోని సహజ సంపదను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఆరోపించారు. కొలనూ ర్‌లో అమ్మపేరుతో ఒక మొక్క నాటిన ఆయన అ నంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చె రువుల మట్టిని ఒకేసామాజిక వర్గానికి చెందిన వ్యా పారులు తరలిస్తున్నారని అన్నారు. ఖైరున్నీసా, అనిల్, పృథ్వీరాజ్, నిర్మల, సదయ్యగౌడ్ ఉన్నారు.