
డిప్యూటీ కమిషనర్‌కు గ్రేడ్–1 హోదా
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామికి ప్రభుత్వం గ్రేడ్–1 హోదా కల్పించింది. మళ్లీ రామ గుండంలోనే డిప్యూటీ కమిషనర్‌గా పోస్టింగ్ ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
మంథని మున్సిపల్ కమిషనర్‌గా వెంకన్న
మంథని: మంథని మున్సిపల్‌కు ఎట్టకేలకు కమిషనర్(గ్రేడ్–3) నియామకమయ్యారు. మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన మంథనికి ఇంతకాలం ఇన్‌చార్జి కమిషనర్లే పాలకులుగా వ్యవహరించారు. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలకు ప్రభుత్వం 56 మంది కమిషనర్లకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఇందులో మంథని బల్దియాకు సీహెచ్. వెంకన్నను పదోన్నతిపై నియమించింది. ప్రస్తుతం మంథని మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్‌గా కార్యాలయ సూపరింటెండెంట్ మనోహర్ వ్యవహరిస్తున్నారు.