
ఖైదీల యోగక్షేమాలు తెలుసుకున్న జడ్జి
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ జిల్లా జైలును సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.వెంకటేశ్‌తో కలిసి సందర్శించారు. ఖైదీల యోగ క్షేమాలు, భోజన వసతులు, న్యాయసేవా, ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్నారు. క్యాంటీన్, ఆసుపత్రి, ములాఖత్, ఫోన్, లైబ్రరీ, వంటశాల, ఇండస్ట్రీలలో పనితీరు పరిశీలించారు. కొత్త చట్టాలు వివరించా రు. మహిళా జైలును కూడా సందర్శించి కేసుల వి వరాలు, బాగోగులు, సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. లాయర్లను పెట్టుకునే స్థోమత లేనివారికి ప్రభుత్వం తరఫున లాయర్లను నియమిస్తామని చె ప్పారు. జైలు సూపరింటెండెంట్ విజయడేని, జైలర్లు పి.శ్రీనివాస్, బి.రమేశ్ ఉన్నారు.