
పనిదొంగలపై నిఘా
మస్టర్ మరింత కఠినం
● విధులకు ఆలస్యమైనా, మధ్యలో పనివదిలేసి వెళ్లినా చర్యలు ● సింగరేణి యాజమాన్యం ఆదేశాలతో ముందుకు సాగుతున్న ఉన్నతాధికారులు
గోదావరిఖని: పనులు తప్పించుకుని తిరిగే ఉద్యో గులపై సింగరేణి కఠిన చర్యలు చేపడుతోంది. విధులకు హాజరై పనిమధ్యలోనే ఇంటికి వెళ్లే వారిపై ప్ర త్యేక దృష్టి సారించింది. సంస్థ వ్యాప్తంగా గైర్హాజర్ సంఖ్య పెరుగుతుండగా, విధులకు హాజరై మధ్యలోనే వెళ్తున్న వారిపై నిఘా పెట్టింది. యూనియ న్లు, రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా చర్యలకు సిద్ధమవుతోంది. భారీ యంత్రాలు పనిచే సే ఓసీపీల్లో పనిగంటలు పెరిగితే ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇదే ఓసీపీల్లో పనిచేస్తున్న ప్రైవేట్ ఓబీల్లో షిఫ్టులో 8గంటల పాటు పనిచేస్తుండగా, అదేసింగ రేణి సంస్థకు చెందిన డిపార్ట్‌మెంట్ పనులు నిర్వహిస్తున్న ఉద్యోగులు సరాసరి రోజుకు 6గంటలు మా త్రమే విధులు నిర్వహిస్తున్నట్లుగా అధికారులు చె బున్నారు. అంతే కాకుండా రక్షణతో కూడిన ఉత్పత్తి కి ప్రాధాన్యం ఇవ్వాలంటోంది. అయితే సింగరేణిలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోవడంతో లైట్‌జాబ్‌లు, ఉచిత మస్టర్లు, విధుల మధ్యలో వెళ్లిపోతున్నట్లుగా యాజమాన్యం గుర్తించింది.
ఓసీపీలపై ప్రత్యేక నిఘా..
సింగరేణిలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఓసీపీలపై యాజమాన్యం దృష్టి సారించింది. ఒకకార్మికుడు విధుల మధ్యలో వెళ్లినా ఆ ప్రభావం షిఫ్టుపై ప్రభావం చూపుతోంది. కొన్ని సందర్భాల్లో పెద్దసంఖ్యలో కార్మికులు బయటకు వెళ్తుండటంతో చట్టపరమైన చర్యలకు వెళ్తోంది. ఈక్రమంలో అధికారులకు కూడా తలనొప్పిగా మారుతోంది.
ఉచిత మస్టర్లు ఇకబంద్..
ఉద్యోగుల ఉచిత మస్టర్లపై యాజమాన్యం దృష్టి సారించింది. మస్టర్‌పడి ఇంటికి వెళ్లేవారిపై డేగకన్ను వేసింది. సెక్యూరిటీ సిబ్బందితోపాటు సీసీ కెమెరాల నిఘా ఉంచింది. డ్యూటీ మధ్యలో వెళ్తున్న కార్మికుల పేర్లను అవుట్‌పోస్టులో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది నమోదు చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలు అందజే స్తున్నారు. దీంతో చార్జిషీట్, సస్పెండ్, నోటీసు జారీ చేయడంలాంటి పనిష్మెంట్ కొనసాగుతోంది.
ఉత్పత్తికి సహకరించాలి
పోటీ యుగంలో ధీటుగా రాణించాలి. పక్కనే ఉన్న ఓబీలో షిఫ్టుకు 8 గంటలు పనిచేస్తుండగా, సింగరేణిలో 6 గంటల వరకు యంత్రాలు వినియోగిస్తున్నారు. దీంతో ఉత్పాదకత ఖర్చు పెరుగతోంది. ఈవిషయంలో ఉద్యోగులందరూ సహకరించాలి. మస్టర్ పడి ఇంటికి వెళ్లినా, డ్యూటీ మధ్యలో వెళ్లినా చర్యలు తప్పవు. – లలిత్‌కుమార్, ఆర్జీ–1 జీఎం

పనిదొంగలపై నిఘా

పనిదొంగలపై నిఘా