‘నీట్‌’గా క్లాసులు | - | Sakshi
Sakshi News home page

‘నీట్‌’గా క్లాసులు

Jun 24 2025 3:27 AM | Updated on Jun 24 2025 3:27 AM

‘నీట్

‘నీట్‌’గా క్లాసులు

కమాన్‌పూర్‌(మంథని): జిల్లాలోని గుండారం ప్ర భుత్వ జూనియర్‌ కళాశాల ఈ ఏడాది నుంచి ఎప్‌ సెట్‌, నీట్‌లో విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేందుకు స ర్వం సిద్ధం చేసింది. ఇదే విషయంపై ఇటీవల విస్త త ప్రచారం చేయడంతో ప్రవేశాల సంఖ్య భారీగా పెరిగింది. ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల భారం మో యలేని తల్లిదండ్రులు.. ప్రభుత్వ కళాశాలల్లో అందుబాటులోకి వస్తున్న ఆధునిక బోధన పద్ధతులుపై ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు.. తమ పిల్లలను అందులో చేర్పిస్తూ ఉచిత విద్య పొందుతున్నారు. జిల్లావాసులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

పెరిగిన అడ్మిషన్లు..

ఈ విద్యాసంవత్సరంలో ప్రతీ ప్రభుత్వ కళాశాలలో 30 శాతం ప్రవేశాలు పెంచాలని విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అడ్మిషన్లు పెంచాలనే లక్ష్యంతో గుండారం కళాశాల అధ్యాపకులు, సిబ్బంది సమీప గ్రామాల్లోకి వెళ్లారు. పదో తరగతి లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. వారిపిల్లలు ప్రభుత్వ కళాశాలలో చేరేలా ప్రోత్సహించారు. కళాశాలలో కల్పిస్తు న్న సౌకర్యాలు, విద్యాబోధన, అందుబాటులోకి వ స్తున్న బోధన తీరు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. దీంతో ఈ విద్యా సంవత్సరంలో 110 మంది విద్యార్థులు గుండారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రవేశాలు పొందారని ప్రిన్సిపాల్‌ తెలిపారు. వారంతా రోజూ క్లాసులకు హారవుతున్నా రు. అత్యధికంగా డిమాండ్‌ ఉన్న ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో విద్యార్థులు చేరారు.

ఈ ఏడాది నుంచి ఎప్‌సెట్‌, నీట్‌ క్లాస్‌లు

ఈ ఏడాది నుంచి కళాశాలలో ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఎప్‌సెట్‌, నీట్‌ క్లాసులను ప్రా రంభించారు. ఈ తరగతులు భవిష్యత్‌లో విద్యార్థులకు ఉపయోగపడతాయని అధ్యాపకు లు తెలిపారు. ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ, వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇది పునాది లాంటిదని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.

ఎప్‌సెట్‌లోనూ ప్రత్యేక తర్ఫీదు

ఈ ఏడాది నుంచే అందుబాటులోకి

గుండారం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ప్రత్యేకత

నిర్దేశిత 30శాతం ప్రవేశాలు అధిగమించిన వైనం

బోధన బాగుంది

గుండారం ప్రభుత్వ కళాశాలలో విద్యా బోధన బాగుందని తెలిసింది. ప్రతీ ఏడాది ఈ కళాశాలలో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకొని ఎంపీసీలో అడ్మిషన్‌ తీసుకున్న.

– సుంచు అశ్విత, సబ్బితం

సౌకర్యాలున్నాయి

ప్రభుత్వ కళాశాలలో ఈ ఏడాది నుంచి నీట్‌, ఎప్‌సెట్‌ క్లాస్‌ ప్రారంభిస్తున్నామని లెక్చరర్లు మా ఇంటికి వచ్చి చెప్పారు. దీంతో నేను బైపీసీలో అడ్మిషన్‌ తీసుకున్నా. విద్యా బోధన, సౌకర్యాలు బాగున్నాయి.

– జి.వెన్నల, పేంచికల్‌పేట

తరగతులు ప్రారంభించాం

ఈ విద్యా సంవత్సరం నుంచి కళాశాలలో ఎంపీసీ, బైపీసీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఎప్‌సెట్‌, నీట్‌ క్లాసులు ప్రారంభించాం. 30 శాతం అడ్మిషన్లు పెంచాలనే ఉన్నతాధికారుల ఆదేశాలను అధిగమించాం. – సుధాకర్‌, ప్రిన్సిపాల్‌,

గుండారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

‘నీట్‌’గా క్లాసులు1
1/3

‘నీట్‌’గా క్లాసులు

‘నీట్‌’గా క్లాసులు2
2/3

‘నీట్‌’గా క్లాసులు

‘నీట్‌’గా క్లాసులు3
3/3

‘నీట్‌’గా క్లాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement