సంక్షేమానికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

సంక్షేమానికి ప్రాధాన్యం

Jun 24 2025 3:27 AM | Updated on Jun 24 2025 3:27 AM

సంక్ష

సంక్షేమానికి ప్రాధాన్యం

పెద్దపల్లిరూరల్‌/ఎలిగేడు: సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వల, పెద్దబొంకూర్‌, ఎలిగేడు మండ లంలో సీసీ రోడ్డు నిర్మాణాలను ప్రారంభించా రు. ఇందిరమ్మ ఇళ్ల పనులకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. గత పాలకులు ప్రజాసంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు. రైతుల సంక్షే మానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ స్వరూ ప, నాయకులు రామ్మూర్తి, మల్లన్న, రాజేంద ర్‌, మహేందర్‌, అర్కుటి సంతోష్‌, పెగడ రమే శ్‌, సరోత్తంరెడ్డి, శ్రీకాంత్‌, కనకయ్య, శ్రీనివాసరెడ్డి, రమేశ్‌, తిరుపతి, రాజయ్య సామ రాజేశ్వర్‌రెడ్డి, దుగ్యాల సంతోష్‌రావు, అర్షనపల్లి వెంకటేశ్వర్‌రావు, కోరుకంటి వెంకటేశ్వర్‌రావు, బూ ర్ల వెంకటసత్యం, నరహరి సుధాకర్‌రెడ్డి, బాలు సాని పరుశరాములుగౌడ్‌, పోల్సాని పుల్లారావు,పూరెల్ల శ్రావణ్‌, కొండయ్య పాల్గొన్నారు.

మహిళా కళాశాలలో చేరండి

గోదావరిఖని: సింగరేణి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలో విద్యార్థులు చేరాలని అద్యాపకులు దేవిక, ఆషాజ్యోతి, టి.నాగమ్మ కోరారు. సోమ వారం ఆర్జీ–2 ఏరియాలో పర్యటించారు. కొత్తగూడెంలో సింగరేణి కళాశాల విశిష్టతలు, వి ద్యాబోధన, సౌకర్యాలు తదితర విషయా ల ను విద్యార్థులకు వివరించారు. సుశిక్షితులు, అ నుభవజ్ఞులైన అధ్యాపకులతో అత్యుత్తమ వి ద్యాబోధన, నాణ్యమైన విద్యాప్రమాణాలు, ఆ హ్లాదకరమైన వాతావరణం ఉందని తెలిపా రు. కార్మికులు, కార్మికేతరుల పిల్లలు కూడా ఇందులో ప్రవేశాలు పొందాలని వారు కోరారు.

‘మోడల్‌’ ఇళ్ల పరిశీలన

కోల్‌సిటీ(రామగుండం): అంతర్గాం, మద్దిర్యా లో నిర్మించిన ఇందిరమ్మ మోడల్‌ హౌస్‌లను బల్దియా అధికారులు సోమవారం పరిశీలించా రు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రామన్‌ మా ట్లాడు తూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తక్కువ ఖర్చుతో త్వరితగతిన ఇళ్ల ని ర్మాణం పూర్తిచేశామన్నారు. డిప్యూటీ ఎగ్జిక్యూ టివ్‌ ఇంజినీర్‌ హన్మంతరావు నాయక్‌, గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ దస్తగిరి, ఏఈ భవనేశ్వరి పాల్గొన్నారు.

సమ్మె నోటీసు అందజేత

పాలకుర్తి: బసంత్‌నగర్‌ అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ పార్థసారథికి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం స మ్మె నోటీసు అందజేశారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్‌ కోడ్‌లను అమలు చేయడం ద్వారా కార్మిక రంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటుందన్నారు. కేంద్ర ప్రభు త్వ చర్యలను నిరసిస్తూ జూలై 9వ తేదీన చేపట్టిన సార్వత్రిక సమ్మెను సంఘటిత, అసంఘటిత కార్మికులు విజయవంతం చేయాలని నా యకులు కోరారు. ఈకార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు వి.చందర్‌, ఉపాధ్యక్షుడు మేకల సతీశ్‌, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సీపెల్లి రవీందర్‌, కృష్ణ పాల్గొన్నారు.

ఎఫ్‌ఎల్‌ఎన్‌ను విజయవంతం చేయాలి

ధర్మారం(ధర్మపురి): ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమా న్ని విజయవంతం చేయాలని జిల్లా విద్యాధికా రి మాధవి కోరారు. వివిధ గ్రామాల్లోని ప్రభు త్వ, ప్రైవేటు పాఠశాలలను సోమవారం ఆమె తనిఖీ చేశారు. విద్యా బోధన విధానం, ఎఫ్‌ఎ ల్‌ఎన్‌, యూనిఫామ్స్‌, పాఠ్యపుస్తకాలు పంపి ణీ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నా రు. మాధవి మాట్లాడుతూ, విద్యార్థులతో కథ ల పుస్తకాలు చదివించాలన్నారు. లైబ్రరీ పీరియడ్స్‌ అన్ని స్కూళ్లలో నిర్వహించాలని సూచించారు. మంచిగా చదివిన పిల్లలను వెనుకబడి పిల్లలతో గ్రూప్‌లుగా విభజించి చదివించాలని సూచించారు. ఎంఈవో ప్రభాకర్‌, సీఆర్‌పీలు కవలిత, కుమారస్వామి పాల్గొన్నారు.

సంక్షేమానికి ప్రాధాన్యం 1
1/3

సంక్షేమానికి ప్రాధాన్యం

సంక్షేమానికి ప్రాధాన్యం 2
2/3

సంక్షేమానికి ప్రాధాన్యం

సంక్షేమానికి ప్రాధాన్యం 3
3/3

సంక్షేమానికి ప్రాధాన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement