
30 లక్షల మొక్కలు లక్ష్యం
పెద్దపల్లిరూరల్: జిల్లాలో చేపట్టే వనమహోత్సవంలో 30 లక్షల మొక్కలు నాటాలనేది లక్ష్యమ ని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. అడిషనల్ కలె క్టర్ అరుణశ్రీతో కలిసి వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో ఆయన సోమవారం సమీక్షించారు. 2 మీటర్లకన్నా ఎక్కువ ఎత్తు ఉన్న మొక్కలనే నాటేలా స్థలాలు ఎంపిక చేసుకోవాలన్నారు. ప్రజలను ఇంలులో భాగస్వాములను చేయాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలో ఇప్పటివర కు 880 మంది రైతులు ఆయిల్‌పామ్ సాగు చే సేందుకు ముందుకొచ్చారని అన్నారు. ఇప్పటికే సాగు చేసిన పంట దిగుబడిపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించా రు. రైతువేదికల వద్ద మంగళవారం నిర్వహించే రైతునేస్తం కార్యక్రమాన్ని రైతులు వినియోగించుకునేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతీరైతువేదికలో కనీసం 300 మంది రైతులు హాజరయ్యేలా చూడాలన్నారు. డీఏవో ఆదిరెడ్డి, ఉద్యా నవన అధికారి జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష