
సమస్యలు.. విన్నపాలు
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాలకు చెందిన ప్రజలు తరలివచ్చి ప్రజావాణిలో సమస్యలపై అందించిన దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించేందుకు తొలి ప్రాధాన్యమివ్వాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
● సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం