మెట్‌పల్లి(కోరుట్ల): పట్టణంలోని మఠంవాడలో ఆదివారం జరిగిన పెద్దమ్మతల్లి జాతర ఉత్సవాల సందర్భంగా రెండువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. ఉత్సవాలు జరుగుతున్న సమయంలో జక్కం రమేశ్, జక్కం పెద్దరాజం, జక్కం నడ్పిరాజం, జక్కం పవన్, జక్కం శేఖర్, జక్కం రాములుకు.. యామ రాజయ్య, యామ రంజిత్, యామ ప్రకాశ్, యామ మారుతి, యామ గంగాధర్‌తో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే పరస్పరం దాడి చేసుకున్నారు. ఇందులో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం ఇరు వర్గాలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అక్కడ కూడా గొడవపడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.