
సమ్మెలో పాల్గొనాలి
జూలపల్లి(పెద్దపల్లి): కార్మికులకు నష్టం చేస్తూ యజమానులకు లాభం చేకూర్చేలా రూపొందించిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలనే డిమాండ్‌తో జూలై 9న చేపట్టే దేశవ్యాప్త సమ్మె లో అన్నిరంగాల కార్మికులు పాల్గొనాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జ్యోతి కోరా రు. సమ్మె ప్రచార పోస్టర్‌ను పంచాయతీ కార్మి కులతో కలిసి మండల కేంద్రంలో ఆదివారం ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, ప్రతీ కార్మికుడికి కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి నగేశ్, నాయకులు సంకెన్ల చంద్రమౌళి, న్యాతరి లచ్చయ్య, ఆంజయ్య, హన్మంతు, ప్రవాంత్, కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు బీఆర్‌ఎస్ అండ
జూలపల్లి(పెద్దపల్లి): వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆకాంక్షించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. పెద్దాపూర్ గ్రామంలో ఆదివారం బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. అనంతరం ఇటీవల నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీపీసీలో నియామకాలు చేపట్టాలి
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీలో నూత న నియామకాలు చేపట్టాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ అన్నారు. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని జ్యోతి భవన్‌లో ఆదివారం జరిగిన జాతీయ ఎన్టీపీసీ మజ్దూర్ సంఘ్ త్రైపాక్షిక సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. భారతీయ మజ్దూర్ సంఘ్ దేశంలోని కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. అనంతరం సదస్సులో పలు తీర్మానాలు చేశారు. పీఎఫ్‌పై వార్షిక వడ్డీ రూ.2.5 లక్షలకు పైగా ఉంటే వడ్డీరేటు తగ్గించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం యూనియన్ కృషి చేయాలని తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో టఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యులు మల్లేశం, రాంనాథ్ గణేశ్, సాగర్‌రాజు, చల్లా సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కుల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
సుల్తానాబాద్(పెద్దపల్లి): కుల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఏఐఎ ఫ్‌బీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి బొంకూరి సురేందర్ సన్నీ అన్నారు. ఆదివారం జి ల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆల్ ఇండియా ఫా ర్వర్డ్ బ్లాక్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా ని ర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్‌చేసి మి ఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అంతరాలు లేని దృఢమైన నూ తన భారతవని నిర్మాణమే లక్ష్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్టీ ప్రారంభించారన్నారు. దేశంలోని అన్నివర్గాల హక్కుల కోసం నిత్యం పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్‌రెడ్డి నాయకత్వంలో రానున్న స్ధానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీలో నిలుపుతామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిపాక అనూష, కల్లేపల్లి రవి, కందుల మౌనిక, ప్రశాంత్, బొంకూరి నవీన్, సింగారపు భవాని, పల్లె రాజేందర్, భూమయ్య, వినయ్, శ్యాం, జోగు అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

సమ్మెలో పాల్గొనాలి

సమ్మెలో పాల్గొనాలి

సమ్మెలో పాల్గొనాలి