
సరిహద్దులో హై అలెర్ట్
● అటు మావోయిస్టులు.. ఇటు పోలీసులు ● భయం భయంగా అటవీ గ్రామాల ప్రజలు
మంథని: సరిహద్దు రా ష్ట్రాలైన ఛత్తీష్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రా రాష్ట్రాల్లో మావోయిస్టులు, పోలీసుల మధ్య జరుగుతున్న యుద్ధంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పేరున్న తూర్పు డివిజన్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళనలు అటవీప్రాంతవాసుల్లో నెలకొన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ని తూర్పు, పశ్చిమ డివిజన్‌లో రెండు దశాబ్దాలకుపైగా మావోయిస్టుల ప్రభావం పెద్దగా కనిపించలేదు. అడపాదడపా తూర్పు డివిజన్‌లో మా టవోయిస్టులు తమ ఉనికి కోసం ఆరాటపడుతుంటే.. పోలీసులు తిప్పుకొడుతున్నట్లు సమాచారం. ఇటీవల కేంద్రప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క టటగార్‌తో మావోయిస్టు పార్టీకి చెందిన పెద్ద క్యాడర్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతోంది. తాజాగా ఆంధ్రా, ఒడిశా సరహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కీలక నేత గాజర్ల రవి ఉరఫ్ గణేశ్ మరణించిన విషయం తెలిసిందే. అయితే, తూర్పు డివిజన్‌లో చాలాఏళ్లపాటు పనిచేసి.. అనేక ఘనటలకు పాల్పడిన గాజర్ల రవి ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా మావోయిస్టు పార్టీ హింసాత్మక చర్యలకు పాల్పడుకుండా పోలీసులు గట్టి నిఘా పెట్టినట్లు సమాచారం. తెలంగాణ– ఛత్తీష్‌గఢ్ సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇన్‌ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఇటీవల ఇద్దరిని హత్య చేశారు. ఈ క్రమంలో ఇటు మావోయిస్టులు, అటు పోలీసుల చర్యలతో సరిహద్దు గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. సరిహద్దుల్లోకి మావోయిస్టు దళాల చొరబాటు లేకుండా పోలీసుల నిఘా గట్టిగానే ఉన్నట్లు సమాచారం. ఏదిఏమైనా పోలీసులు, మావోయిస్టుల చర్యలతో సరిహద్దు గ్రామాల్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది.