
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
జ్యోతినగర్(రామగుండం): యువత మత్తు పదా ర్థాలకు దూరంగా ఉండాలని ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్‌కిరణ్ సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మత్తు పదార్థాలపై ఎన్టీపీసీ పోలీసుస్టేషన్‌లో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు బానిసలుగా మారితే జీవితం అర్ధంతరంగా ముగిసిపోతుందని అన్నారు. అనారోగ్య సమస్యలతోపాటు కుటుంబం, సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. యువత మానసిక, శారీరక అనర్థాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలు, వాటి నుంచి ఎలా బయటపడాలో వివరిస్తూ వివిధ రూపాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. ఉద్యోగులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సైలు నా యుడు, తిరుపతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గడువు పొడిగింపు
సుల్తానాబాద్(పెద్దపల్లి): దివ్యాంగులు ఉపకరణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు ఈనెల 27వ తేదీ వరకు గడువు పొడించారని జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ తెలిపారు. ఆధునికీకరించిన ఉపకరణాలను 100 శాతం రాయితీపై అర్హులైన దివ్యాంగులకు అందిస్తారన్నారు. వివరాలకు https://tsobmms.cgg.gov.in// వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలని ఆయన కోరారు.