పరిశ్రమలతోనే దేశ ప్రగతి | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమలతోనే దేశ ప్రగతి

Jun 22 2025 4:06 AM | Updated on Jun 22 2025 4:06 AM

పరిశ్

పరిశ్రమలతోనే దేశ ప్రగతి

జ్యోతినగర్‌(రామగుండం): పరిశ్రమలు పురోగతిలో ఉంటేనే దేశం ప్రగతి సాధిస్తుందని జా తీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్‌ అన్నారు. ఎన్టీపీసీ జ్యోతిక ఆడిటోరియంలో బీఎంఎస్‌ అనుబంధ ఎన్టీపీసీ మజ్దూర్‌ సంఘ్‌ 12వ త్రైపాక్షిక జాతీయ సదస్సు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడారు. ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు సుంకరి మ ల్లేశం, ప్రతినిధులు రాంరెడ్డి, సురేంద్ర రాథోడ్‌, బీరేంద్ర, సాగర్‌రాజు, సత్యనారాయణరెడ్డి, రా ములు, గిరి, నరేందర్‌ పాల్గొన్నారు. ఐఎన్టీయూసీకి రాజీనామా చేసిన బండారి కనకయ్య బీఎంఎస్‌లో చేరగా ఆహ్వానించారు.

సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యం

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): సంపూర్ణ అక్షరాస్యత సాధించడం సామాజిక బాధ్యతని అదనపు డీ ఆర్డీవో రవీందర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో సెర్ప్‌, మెప్మా సిబ్బందికి శనివారం ఉల్లాస్‌ యాప్‌పై అవగాహన కల్పించారు. జిల్లాలోని స్వశక్తి సంఘా మహిళలు అక్షరాస్యతపై 90శాతం సర్వేచే శారని, మరో రెండుమూడ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిచేసి ‘ఉల్లావ్‌’ యాప్‌లో నమోదు చేయా లని కోరారు. చదవడం, రాయడం నేర్చుకున్న మహిళల్ని ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌లో ప్రవేశాల కో సం పరీక్షలు రాయించాలని సూచించారు. అ డల్ట్‌ ఎడ్యుకేషన్‌ ఏపీవో శ్రీనివాస్‌, జిల్లా ఉమ్మ డి పరీక్షల బోర్డు కార్యదర్శి హన్మంతు, జీసీడీవో కవిత, అధికారి రవి పాల్గొన్నారు.

ఆస్పత్రిలో క్యాంటీన్‌ ప్రారంభం

పెద్దపల్లిరూరల్‌: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చై తన్య జ్యోతి మహిళా సంఘం ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను అడిషనల్‌ డీర్‌డీవో రవీందర్‌ ప్రారంభించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్లకు అవసరమైన ఆహారం సరఫరా చేసేందుకు చైతన్య జ్యోతి జిల్లా మహిళా సమాఖ్యకు డైట్‌ కాంట్రాక్టు అప్పగించారన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ప్రకారం నాణ్యమైన భోజనం పేషెంట్లకు అందించాలని ఆయన సూచించా రు. అనంతరం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందజేశారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

నియామకం

పెద్దపల్లిరూరల్‌: జమాతే ఇస్లామీ హింద్‌ జిల్లా అధ్యక్షుడిగా ఎంఏహెచ్‌ జావెద్‌ను నియమించారు. ఈమేరకు పట్టణ అధ్యక్షుడు ఎంఏ మో హిద్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. జమాతే ఇస్లామీ హింద్‌ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో జావెద్‌కు ఈ పదవి అప్పగించినట్లు ఆయన వివరించారు.

గడువు పొడిగింపు

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): అసంఘటిత రంగంలోని కార్మికులు పరిహారం కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగించారని సహాయ కార్మిక అధికారి ఎంకే హేమలత తెలిపారు. ఈ– శ్రమ్‌ పోర్టల్‌లో పేరు, ఇతర వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన, శాశ్వతంగా అంగవైకల్యం కలిగినా కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నుంచి పరిహారం మంజూరవుతుందని హెమలత పేర్కొన్నారు.

2న షిర్డీకి ఆర్టీసీ బస్సు

గోదావరిఖనిటౌన్‌: వచ్చే జూలై 2వ తేదీన షి ర్డీకి ఆర్టీసీ బస్సు సర్వీసు నడుపుతామని డీఎం నాగభూషణం తెలిపారు. ఉదయం 10 గంటలకు గోదావరిఖనిలో సూపర్‌ లగ్జరీ బస్సు ప్రా రంభమవుతుందని, యాత్రలో భాగంగా తొ లుత బాసర సరస్వతీదేవి ఆలయం, త్రయంబకేశ్వరాలయం, షిర్డీ సాయి బాబా దర్శనం ఉంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో శనిసింగాపూర్‌ ఆలయాల దర్శనం ఉంటుందని తెలిపారు. జూలై 5వ తేదీన బస్సు గోదావరిఖనికి చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.4,300, పిల్లలకు రూ. 3,500 ప్రయాణ చార్జీలు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. వివరాలకు 70135 04982, 73828 47427 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.

సార్‌ ఆశయాలతో ముందుకు

మంథని: తెలంగాణ రాష్ట్ర సాధనకోసం తుది శ్వాస వరకూ ఉ ద్యమించిన ప్రొ ఫెసర్‌ జయశంకర్‌ మలిదశ ఉ ద్యమానికీ ఊపి రి పోశారని మా జీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. శనివారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మధు మాట్లాడుతూ, ఆనాడు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జయశంకర్‌ సారథ్యంలో మాజీ సీఎం కేసీఆర్‌ ఉద్యమా న్ని ముందుకు తీసుకెళ్లారన్నారు. శంకర్‌గౌడ్‌, తిరుపతి, రాజబాపు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

పరిశ్రమలతోనే దేశ ప్రగతి 1
1/2

పరిశ్రమలతోనే దేశ ప్రగతి

పరిశ్రమలతోనే దేశ ప్రగతి 2
2/2

పరిశ్రమలతోనే దేశ ప్రగతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement