● కలెక్టర్ కోయ శ్రీహర్ష
సుల్తానాబాద్/యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణి ప్రభావిత రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో సింగరేణి మైన్స్ కోసం భూములు కోల్పోతున్న అర్హులైన నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సింగరేణి లీజు భూముల పరిహారం ప్రక్రియపై శనివారం సుందిళ్ల గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ మాట్లాడారు. ఆర్జీ–1లో బొగ్గు గనులకు అవస రమైన లీజు కోసం 269 ఎకరాల్లో సర్వే చేశారని, రికార్డుల ప్రకారం ఇవి సింగరేణి లీజు భూములన్నారు. ఒక్కో సర్వే నంబరులో నలుగురైదుగురు రైతులు యాజమాన్య హక్కు క్లెయిమ్ చేస్తున్నారని కలెక్టర్ వివరించారు. అధికారికంగా పట్టాలు లేకు న్నా కబ్జాలోనివారు నష్ట్రపోతారనే ఉద్దేశంతో మానవతా దృక్పథంతో ఎకరాకి రూ.6.50 లక్షల చొప్పు న పరిహారం చెల్లించేలా సింగరేణి యాజమాన్యా న్ని ఒప్పించామని ఆయన వెల్లడించారు. ఈక్రమంలోనే అర్హులైన జాబితానే రూపొందించామని కలెక్టర్ తెలిపారు. అనర్హులు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి సురేశ్, ఆర్జీ–1 జీఎం లలిత్ కుమార్, తహసీల్దార్ సుమన్ పాల్గొన్నారు.
నిరంతరంగా విద్యుత్ సరఫరా
పెద్దపల్లిరూరల్: జిల్లాలో వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. విద్యుత్ శాఖ పనితీరుపై కలెక్టరేట్‌లో శనివారం ఆయన సమీక్షించారు. జిల్లాలోని 7 సబ్ డివిజన్లలో అవసరం మేరకు విద్యుత్ స్తంభాలు అందుబాటులో ఉంచాలని, లైన్‌మెన్ అప్రమత్తంగా ఉండాలని, లూస్ వైర్లు సరిచేయాలని, ఇళ్లనుంచి వెళ్లే, వేలాడే విద్యుత్ తీగలు సరిచేయాలని ఆదేశించారు. జిల్లాలోని ఒక మండలాన్ని ఎంపిక చేసుకొని సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్‌ఈ మాధవరావు, డీఈలు తదితరులు పాల్గొన్నారు.