
బాలికా విద్యకు ఎన్టీపీసీ భరోసా
● జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ బాలికల విద్య కు భరోసా కల్పించడం అభినందనీయమని జాతీ య ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ అన్నారు. శనివారం రాత్రి ఎన్టీపీసీ రామగుండం పీ టీఎస్‌లోని వికాస కేంద్రం హాల్‌లో ఎన్టీపీసీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న బాలికలకు ఆయన సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్టీపీసీ విద్యుత్ ఉ త్పత్తి పాటు ప్రభావిత, పునరావాస గ్రామాల ప్రజ ల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మరింత కృషి చేయాలని సూచించారు. ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత, దీప్తి మహిళా సమి తి అధ్యక్షురాలు రాకీ సామంత, ఎన్టీపీసీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు న వనీత్ రాథోడ్, కార్యదర్శి మహేందర్, అంజయ్య, ఉద్యోగ గుర్తింపు సంఘం ప్రతినిధులు ఉన్నారు.