
క్రీడాకారుల ప్రతిభ వెలికితీసేందుకే పోటీలు
పాలకుర్తి(రామగుండం): గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి వారికి ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో తనతండ్రి సత్యనారాయణ స్మారకార్థం బసంత్‌నగర్‌లో అంతర్‌జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్ర ఐఅండ్ పీఆర్ కమిషనర్ పరికిపండ్ల నరహరి అన్నారు. బసంత్‌నగర్‌లో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న వాలీబాల్ టోర్నమెంట్‌ను సందర్శించి క్రీడాకారులతో ముచ్చటించారు. ఏటా ఈ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ బసంత్‌నగర్‌లోని నరహరి స్వగృహానికి వచ్చి ఆయనతో కలిసి వాలీబాల్ టోర్నమెంట్‌ను సందర్శించారు. ఫౌండేషన్ సభ్యులు నాగార్జున, కన్నం వెంకటేశ్, దయానందం, మల్క రామస్వామి, శ్రీకాంత్, రమేశ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. కాగా వాలీబాల్ టోర్నమెంట్‌తో స్థానికంగా సందడి వాతావరణం నెలకొన్నది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ చెందిన మొత్తం 26జట్లు పాల్గొంటున్న టోర్నమెంట్‌ను వీక్షించేందుకు ప్రజలు, క్రీడాభిమానులు అధికసంఖ్యలో వస్తుండటంతో సందడిగా మారింది.