
గాంధీ కుటుంబానికే దేశాన్ని పాలించే సత్తా
సుల్తానాబాద్: గాంధీ కుటుంబానికే దేశాన్ని పాలించే సత్తా ఉందని పెద్దపల్లి శాసన సభ్యుడు చింతకుంట విజయరమణారావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని నెహ్రూ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇటీవల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాకిస్తాన్‌తో యుద్ధం విషయంలో అవలంబించిన ధోరణి యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన జూడో యాత్రతో ఆయన పరిణతి చెందిన విధానం, నిబద్ధత, అంకుటిత దీక్ష, సత్తా దేశ ప్రజలందరూ గమనించారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణలో కుల గణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరి మహేందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిలుక సతీశ్, వేగోళం అబ్బయ్యగౌడ్, డి.దామోదర్‌రావు, కుమార్ కిషోర్, పన్నాల రాములు, బిరుదు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.