ఉత్పత్తి చేయాల్సింది 12 మిలియన్‌ టన్నులు | - | Sakshi
Sakshi News home page

ఉత్పత్తి చేయాల్సింది 12 మిలియన్‌ టన్నులు

Mar 3 2025 12:07 AM | Updated on Mar 3 2025 12:06 AM

ఫిబ్రవరి వరకు ఉత్పత్తి చేసింది 60 మిలియన్‌ టన్నులు

నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధన వైపు సింగరేణి పరుగులు

గోదావరిఖని: సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25లో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి సాధించడానికి మిగిలింది సుమారు నెలరోజులే ఉంది. ఇప్పటివరకు 60 మిలియన్‌ టన్నుల బొగ్గు వెలికితీసింది. ఇంకా 12 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉంది. ప్రధానంగా ఓసీపీల్లో ఉత్పత్తిపైనే ప్రత్యేక దృష్టి సారించింది. లాభాల బాటలో కొనసాగుతున్న ఓసీపీల్లో ఉత్పత్తి పెరిగితే సంస్థకు మరిన్ని లాభాలు వస్తాయని సింగరేణి భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తిపై యాజమాన్యం దృష్టి కేంద్రీకరించింది.

లక్ష్య సాధనకు సానుకూలమే..

ఈసారి వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించలేకపోయింది. ఈ మార్చితో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఇంకా సుమారు నెలరోజుల సమయం ఉండడంతో ఉత్పత్తికి అన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయని యాజమాన్యం భావిస్తోంది. ఈలోగా వందశాతం బొగ్గు ఉత్పత్తి చేయాలని పేర్కొంటోంది. ఇదే సమయంలో రక్షణ చర్యలు పటిష్టంగా అమలు చేస్తోంది.

ఏరియాల వారీగా సమీక్ష..

సింగరేణిలోని 11 ఏరియాల అధికారులతో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణ చర్యలపై యాజమాన్యం తరచూ సమీక్షిస్తోంది. టెలి, వీడియో కాన్ఫరెన్స్‌లు, డైరెక్టర్ల ఆకస్మిక తనిఖీలతో ఉత్పత్తిలో వేగం పెంచింది. సీఎండీ బలరాం కూడా గనులపై పర్యటించి ఉత్పత్తి పెంపుపై ఉద్యోగులు, కార్మి కులకు దిశానిర్దేశం చేశారు. మార్కెట్‌లో పోటీని తట్టుకునేందుకు తక్కువ ధరకే బొగ్గు ఉత్పత్తి చేయాలని ఆయన సూచించారు. ఆయన పర్యటన తర్వాత కొన్ని గనుల్లో ఉత్పత్తి ఆశాజనకంగా సాగుతోందని ఏరియాల అధికారులు చెబుతున్నారు.

ఒకరోజ ప్రొడక్షన్‌ డే..

బొగ్గు ఉత్పత్తి బాగా వచ్చే ఓసీపీల్లో వారంలో ఒకరోజు ప్రొడక్షన్‌ డేగా ప్రకటించారు. ప్రొడక్షన్‌ డే రోజులో 22 గంటలపాటు యంత్రాలు పనిచేసేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఈక్రమంలో డ్యూటీలోని ఉద్యోగులకు అల్పాహారం, భోజనం కూడా అంది స్తూ యాజమాన్యం పోత్సహిస్తోంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి వివరాలు

సింగరేణిలోని మొత్తం ఓసీపీలు 17

భూగర్భ గనుల సంఖ్య 22

నిర్దేశిత లక్ష్యం(మిలియన్‌ టన్నుల్లో) 72

ఫిబ్రవరి వరకు(మిలియన్‌ టన్నుల్లో) 64.31

ఫిబ్రవరి వరకు సాధించింది(మిలియన్‌ టన్నుల్లో) 60

నమోదు చేసిన బొగ్గు ఉత్పత్తి శాతం 93

ఫిబ్రవరి వరకు సాధించిన బొగ్గు ఉత్పత్తి

(ఏరియాల వారీగా లక్షల టన్నుల్లో..)

ఏరియా లక్ష్యం సాధించింది శాతం

ఆర్జీ–1 44.92 42.21 94

ఆర్జీ–2 87.80 82.94 94

ఆర్జీ–3 56.42 55.57 98

ఏపీఏ 3.91 3.94 101

భూపాలపల్లి 43.20 31.87 74

కొత్తగూడెం 131.84 126.64 96

ఇల్లెందు 35.85 39.41 110

మణుగూరు 115.92 112.14 97

బెల్లంపల్లి 33.80 32.07 95

మందమర్రి 32.06 24.53 77

శ్రీరాంపూర్‌ 57.45 49.57 86

రక్షణతో కూడిన ఉత్పత్తి లక్ష్యం

ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత 72 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సిందే. ఇదేసమయంలో పూర్తిగా రక్షణ చర్యలు తీసుకోవాలి. పోటీ మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు తక్కువ వ్యయంతో బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. భారీయంత్రాల పనిగంటలు పెంచితే ఇది సాధ్యమే. భూగర్భగనుల్లోనూ ఉత్పత్తి వ్యయం తగ్గించేందుకు ఉత్పాదకత పెంచాలి.

– బలరాం, సీఎండీ, సింగరేణి

ఉత్పత్తి చేయాల్సింది 12 మిలియన్‌ టన్నులు 1
1/1

ఉత్పత్తి చేయాల్సింది 12 మిలియన్‌ టన్నులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement