
సమావేశంలో మాట్లాడుతున్న విజయరమణారావు
ఎలిగేడు(పెద్దపల్లి): ఎలిగేడు మండల కేంద్రానికి పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి నేటికీ అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందని పీసీసీ ఉపాధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మండల కేంద్రంలో పోలీస్‌స్టేషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు, తదితర హామీలను గత ఎన్నికల్లో నేతలు ఇవ్వగా నేటికీ నీటిమీద రాతగానే మిగిలాయని విమర్శించారు. పెద్దపల్లి బస్టాండ్ నుంచి తన కాలేజీకి వేసుకున్న రోడ్ ఇతర గ్రామాల్లో ఉందా, ఎలిగేడు మండలానికి ఎన్ని సీసీ రోడ్లు వచ్చాయి..ఎన్ని కంప్లీట్ చేశారు అని ప్రశ్నించారు. అసమర్థపు ఎమ్మెల్యే వారి పార్టీవారికే సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటు పొతే పేద ప్రజల పరిస్థితి ఏమిటి అని అన్నారు. కాంగ్రెస్ నాయకుడు వేముల రామ్మూర్తి, విజయరమణారావుకు నిమ్మరసం ఇచ్చి దీక్ష వీరమింపజేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్‌రెడ్డి, కళ్లేపల్లి జానీ, అంతటి అన్నయ్యగౌడ్, గోపగాని సారయ్యగౌడ్, మినుపాల ప్రకాశ్‌రావు, దామోదర్‌రావు, నుగిల్ల మల్లన్న, సాయిరి మహేందర్, సయ్యద్ మస్రత్ తదితరులు పాల్గొన్నారు.