
మాట్లాడుతున్న ఎంఎస్ రాజ్‌ఠాగూర్
ధర్మారం(పెద్దపల్లి): ధర్మారం మండలం బంజేరుపల్లిలో గురువారం సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ బోగ్ బండార్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. సేవాలాల్ మహరాజ్ ఆలయానికి స్థలం కేటాయించి ఆలయ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ భూక్య చంద్రనాయక్, ఎంపీటీసీ భూక్య సరిత, గిరిజన నాయకులు భాస్కర్‌నాయక్, మంఛానాయక్, భూక్య రాజునాయక్, ఇస్లావత్ రాజునాయక్, గిరిజన కుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ గెలుపే
లక్ష్యంగా పనిచేయాలి
గోదావరిఖని: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజ్‌ఠాగూర్ అన్నారు. గురువారం అశోక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా తమ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. రూ.2 లక్షల వరకు రైతుల రుణమాఫీ, సొంతిళ్లు నిర్మించుకునే నిరుపేదలకు రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయంతో పాటు పలు సంక్షేమ పథకాలు కాంగ్రెస్‌తోనే సాధ్యమని తెలిపారు. ఈసందర్భంగా పలువురు కాంగ్రెస్‌లో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ ముస్తఫా, మహంకాళి స్వామి, గట్ల రమేశ్, తాళ్లపెల్లి యుగేందర్, వీరబోయిన రవియాదవ్, కొమ్ము శ్రీనివాస్, ధూళికట్ట కుమార్, కౌటం సతీశ్, గాలిపెల్లి రాజేశ్, సాగర్, నాగరాజు, విజయ్, బంక శ్రీధర్, జడల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జేబీసీసీఐ వేజ్‌బోర్డు శాశ్వత సభ్యుడిగా జనక్‌ప్రసాద్
గోదావరిఖని: బొగ్గు గని కార్మికుల వేతన సంఘం(జేబీసీసీఐ) శాశ్వత సభ్యుడిగా బి.జనక్‌ప్రసాద్‌ను నియమించారు. ఐఎన్‌టీయూసీ యూనియన్ నుంచి వేజ్‌బోర్డు పర్మినెంట్ మెంబర్‌గా అవకాశం కల్పించారు. ఐఎన్‌టీయూసీ యూనియన్‌కు సంబంధించి రెండువర్గాల వివాదం కోర్టులో కొనసాగుతుండటంతో ఇప్పటివరకు ఐఎన్‌టీయూసీ యూనియన్‌ను కోలిండియా యాజమాన్యం ఆహ్వానించలేదు. పార్టీ అధిష్టానం జోక్యంతో కొన్నాళ్లుగా ఉన్న వివాదం సద్దుమణిగింది. దీంతో సింగరేణిలో కీలకపాత్ర పోషిస్తూ, ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్‌గా కొనసాగుతున్న జనక్‌ప్రసాద్‌కు జేబీసీసీఐ చర్చల శాశ్వత సభ్యుడిగా అవకాశం లభించింది.
దరఖాస్తుల స్వీకరణకు
నేడు తుదిగడువు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల ఎంపిక కోసం దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 31వ తేదీ తుది గడువని జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమాధికారి నాగలైశ్వర్ తెలిపారు. జిల్లాలోని ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు దరఖాస్తు చేసుకునే అవకాశముందన్నారు. బెస్ట్ అవైలబుల్ పథకం కింద ఎంపికై న రెసిడెన్షియల్ పాఠశాలలో చదివే ప్రతీ విద్యార్థికి రూ.42 వేలు చెల్లిస్తారన్నారు. నాన్‌రెసిడెన్షియల్ విద్యార్థులకు రూ.28వేల చొప్పున చెల్లిస్తారని వివరించారు.

పూజలు చేస్తున్న మంత్రి ఈశ్వర్ దంపతులు
