హెచ్‌ఐవీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
● జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ రాణి
విజయనగరం ఫోర్ట్: హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కె.రాణి పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా ఆదివారం రంగోలి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవగాహన ద్వారానే హెచ్‌ఐవీని నియంత్రించవచ్చన్నారు. హెచ్‌ఐవీ రోగుల పట్ల ప్రేమ, అప్యాయత చూపించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం ఉమామహేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.


