ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

Nov 30 2025 8:06 AM | Updated on Nov 30 2025 8:06 AM

ఆదివా

ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

మాఘం.. మౌఢ్యం మాయం ఉపాధికి గ్రహణం.. వ్యాపారం శూన్యం కళత్ర కారకుడు బలహీనపడితే కష్టమే..

న్యూస్‌రీల్‌

ఆదర్శ వివాహాలకు ఇదే అదను!

పార్వతీపురం రూరల్‌: పెళ్లి పందిరిలో సందడి... వేద పండితుల మంత్రోచ్ఛారణలు... మంగళవాయిద్యాల హోరు... బంధుమిత్రుల కోలాహలం... ఇవన్నీ ఇక కొన్నాళ్ల పాటు నిలిచిపోనున్నాయి. ముహూర్తం బాగుంటేనే ముచ్చటగా నూరేళ్లు బతుకుతారు.. అన్నది మన సంప్రదాయం. అందుకే ఘడియలు, విఘడియలు లెక్కగట్టి మరీ లగ్నాలు పెడతారు. కానీ, ఆ శుభ ఘడియలకు బ్రేక్‌ పడింది. శుక్రవారం నుంచి మొదలైన శుక్రమౌఢ్యమి (మూఢం) కారణంగా సుదీర్ఘ విరామం ఏర్పడింది. రేపటి (నవంబర్‌ 30) నుంచి మొదలై వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 వరకూ, అంటే దాదాపు 80 రోజుల పాటు ముహూర్తాలకు బ్రేక్‌ పడనుంది. దీంతో పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా శుభకార్యాల సందడి సద్దుమణిగింది.

సాధారణంగా కార్తీక మాసం ముగిసిందంటే మాఘ మాసం కోసం పెళ్లివారి చూపులు ఉంటాయి. మాఘ మాసంలో మట్టిని ముట్టుకున్నా మాణిక్యమే అన్న నానుడి ఉంది. అంతటి పవిత్రమైన మాసంలో ఈసారి ఒక్కటంటే ఒక్క ముహూర్తం కూడా లేకపోవడం గమనార్హం. ఈసారి మాఘమంతా మూఢంలోనే కలిసిపోవడంతో శుభకార్యాల ఆశలు ఆవిరయ్యాయి. గృహ ప్రవేశాలకు అత్యంత ప్రీతిపాత్రమైన రథసప్తమి, చదువుల తల్లిని కొలిచే వసంత పంచమి, మాఘ పౌర్ణమి వంటి విశేష పర్వదినాలు సైతం ఈ మూఢం నీడన మసకబారాయి. ఇప్పటికే సంబంధాలు కుదుర్చుకున్న వారు సైతం ఫిబ్రవరి మూడో వారం వరకు వేచి చూడక తప్పని పరిస్థితి.

శుభ కార్యాలంటే కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు. అది అనేక రంగాల ఉపాధికి ఆలంబన. ఈ 80 రోజుల విరామం వ్యాపార వర్గాలకు నిజంగా గడ్డుకాలమే. జిల్లాలోని కల్యాణ మండపాలు, ఫంక్షన్‌ హాళ్లు రాబోయే మూడు నెలలు ఖాళీగా దర్శనమివ్వనున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌పైనే ఆధారపడే పట్టుచీరల వ్యాపారులు, స్వర్ణకారుల గిరాకీ గణనీయంగా పడిపోనుంది. స్థానిక వస్త్ర దుకాణాలు కళ తప్పనున్నాయి. పెళ్లిళ్లలో సందడి చేసే సన్నాయి మేళాలు, డెకరేషన్‌ పనివారు, టెంట్‌ హౌస్‌ నిర్వాహకులు, క్యాటరింగ్‌ సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు, పూల వ్యాపారులు, లైటింగ్‌, డీజే ఆపరేటర్లు ఇలా ఒకరేమిటి, శుభకార్యాలే జీవనాధారంగా బతికే వేలాది కుటుంబాల ఉపాధికి గండి పడనుంది. నిత్యం పెళ్లి పీటలపై వేదమంత్రాలు చదివే పురోహితులు, అర్చకులకు కూడా ఈ సమయం ఆర్థికంగా సవాళ్లతో కూడుకున్నదే.

జ్యోతిష్య శాస్త్ర రీత్యా వివాహ వ్యవస్థకు, దాంపత్య సౌఖ్యానికి శుక్రుడే ప్రధాన కారకుడు (కళత్ర కారకుడు). సూర్యునికి అత్యంత సమీపంలోకి శుక్రుడు వచ్చినప్పుడు, సూర్యరశ్మి తీవ్రతకు శుక్ర గ్రహ ప్రభావం కనుమరుగవుతుంది. దీనినే అస్తంగత్వం లేదా మౌఢ్యమి అంటాం. వరుడికి బలం ఇచ్చే రవి, వధువుకు బలం ఇచ్చే గురుడు, భోగభాగ్యాలనిచ్చే శుక్రుడు వీరిలో ఏ ఒక్కరు బలహీనపడినా ఆ సమయంలో చేసే వివాహాలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు. ముఖ్యంగా శుక్ర మౌఢ్యమిలో వివాహం చేసు కుంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం, సంతానలేమి లేదా అనారోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉందని ముహూర్త చింతామణి, కాలవిధానం వంటి ప్రామాణిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది మూఢనమ్మకం కాదు, ఖగోళ శాస్త్ర రీత్యా గ్రహాల నుంచి వెలువడే కిరణాల ప్రభావం. అందుకే ఈ 80 రోజులు శుభకార్యాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం.

– మురపాక కాళిదాసు శర్మ యాజీ,

ప్రముఖ నాడీ జ్యోతిష్యులు

జ్యోతిష్య శాస్త్ర రీత్యా దాంపత్య సౌఖ్యానికి, భోగభాగ్యాలకు కారకుడు శుక్రుడు. ఆ శుక్రగ్రహం సూర్యుని కిరణాల ప్రతాపానికి కనుమరుగవడాన్నే మౌఢ్యమి అంటారు. శుక్రుడు అస్తంగతుడైన వేళ చేసే వివాహాలు దంపతుల మధ్య కలతలకు, ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తాయని పండితులు చెబుతున్నారు. అందుకే ఈ 80 రోజులు ఎలాంటి శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, వివాహాలు నిషిద్ధమని స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి కల్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అంటారు గానీ, ఈ మూఢం దెబ్బకు మాత్రం ఆగక తప్పదు. మళ్లీ ఫిబ్రవరి 17న మాఘ బహుళ అమావాస్య తర్వాతే జిల్లాలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అప్పటి వరకు శుభస్య శీఘ్రం కాస్తా... శుభస్య ఆలస్యంగా మారనుంది.

బాజా మోగదు.. బంతీ సాగదు..!

మాఘ మాసపు పెళ్లి సందడి మౌఢ్యంతో నిశ్శబ్దం

ఫిబ్రవరి 17 వరకు ముహూర్తాలకు సెలవు

కల్యాణ మండపాలు, కేటరింగ్‌, పూల వ్యాపారాలు డీలా

కల్యాణ ఘడియలకు ‘శుక్ర’ గ్రహణం

ఓ పక్క మూఢం కారణంగా సంప్రదాయ వివాహాలు ఆగిపోతుంటే, మరోపక్క ఇదే అదనుగా ఆదర్శ వివాహాల వైపు అడుగులు వేయాలన్న వాదనలూ వినిపిస్తున్నాయి. మూఢమి, ముహూర్తాల పేరుతో నెలల తరబడి వేచి చూడకుండా, రిజిస్టర్‌ మ్యారేజ్‌ (చట్టబద్ధ వివాహం) చేసుకోవడానికి ఈ సమయం అనుకూలమని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు. వేల రూపాయలు వెచ్చించి ఆర్భాటాలకు పోకుండా, కేవలం దండలు మార్చుకుని, చట్ట ప్రకారం ఒక్కటవ్వాలనుకునే వారికి గ్రహాల గమనం అడ్డురాదు. మూఢమి భయంతో వాయిదా పడే పెళ్లిళ్లను, నిరాడంబరంగా ‘రిజిస్టర్‌’ ఆఫీసులో జరిపించడానికి యువత చొరవ చూపితే ఖర్చుతో పాటు, సమయం కూడా ఆదా అవుతుందని, మూఢ నమ్మకాలకు చెక్‌ పెట్టినట్లవుతుందని విజ్ఞుల మాట.

ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 20251
1/4

ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 20252
2/4

ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 20253
3/4

ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 20254
4/4

ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement