దేశ సేవలో భాగస్వాములు కావాలి
విజయనగరం రూరల్: సైనిక పాఠశాల విద్యార్థులు దేశ సేవలో భాగస్వాములు కావాలని తూర్పు నావికాదళ కమాండ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్, రియర్ అడ్మిరల్ మురళీమోహన్‌రాజు అన్నారు. కోరుకొండ సైనిక పాఠశాల వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్నారు. సైనిక పాఠశాల యూనిఫాం పాఠశాల నైతికతను, తల్లిదండ్రుల త్యాగాలను, అంచలమైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. విద్యార్థుల క్రమశిక్షణలో తొలి గురువులు తల్లిదండ్రులేనని, నాయకత్వ ప్రయాణంలో నిజమైన భాగస్వాములని పేర్కొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్‌ఎస్ శాస్త్రి మాట్లాడుతూ సైనిక పాఠశాల క్రమశిక్షణతో కూడిన విద్య, క్రీడాంశాల్లో ఉత్తమ ప్రదర్శనలో ముందు వరుసలో ఉంటుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాహస కృత్యాలు, జానపద, ఇతర సాంస్కతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులకూ పలు పోటీలను నిర్వహించారు. అనంతరం ప్రతిభ గల విద్యార్థులు, వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతులు, మెడల్స్, షీల్డ్‌లు అందజేశారు. పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తూర్పు నావికాదళ కమాండ్,
చీఫ్ ఆఫ్ స్టాఫ్, రియర్ అడ్మిరల్ మురళీమోహన్‌రాజు
ఘనంగా కోరుకొండ సైనిక పాఠశాల వార్షికోత్సవం
దేశ సేవలో భాగస్వాములు కావాలి


