గిరిమిత్రలో టెండర్ ప్రక్రియ
పార్వతీపురం: పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలలకు జీసీసీ సరుకుల టెండర్లు ప్రక్రియను జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో సి.యశ్వంత్ కుమార్‌రెడ్డి పర్యవేక్షణలో శనివారం నిర్వహించారు. గిరిజన సంక్షేమ వసతిగృహలకు, పాఠశాలలకు అత్యవసరమైన, నాణ్యమైన సరుకులను సరఫరా చేసేందుకు ఈ టెండర్ ప్రక్రియ నిర్వహించినట్టు పీఓ తెలిపారు. టెండర్ దక్కించుకున్న వారు వసతిగృహలకు, పాఠశాలలకు విధిగా సరుకులను ఏడాది పాటు సరఫరా చేయాల్సి వుంటుందన్నారు. కార్యక్రమంలో ఏపీవో పి.మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.


