ఆకతాయిలపై డేగకన్ను
పార్వతీపురం రూరల్: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ఆధునిక అస్త్రాన్ని ప్రయోగించారు. ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి ఆదేశాల మేరకు, ఏఎస్పీ మనీషా రెడ్డి పర్యవేక్షణలో శక్తి టీమ్స్ శుక్రవారం డ్రోన్ల సాయంతో విస్తృత నిఘా చేపట్టాయి. బస్టాండ్లు, మార్కెట్లు, కళాశాల ప్రాంగణాల వంటి రద్దీ ప్రదేశాలతో పాటు, జనశక్తి కాలనీ అవుట్‌స్కట్స్, కొత్తవలస రైల్వేస్టేషన్, అమరావతి లేఅవుట్లలో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టారు. దీనివల్ల గంజాయి సేవించే హాట్‌స్పాట్లు, పేకాట స్థావరాలను తక్షణమే గుర్తించి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశారు. పాఠశాలలు, కళాశాలల వద్ద ఈవ్ టీజింగ్‌ను నిలువరించి, ఆకతాయిలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అదే విధంగా, ప్రజలకు, విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, పోక్సో చట్టాలు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల దుష్ఫలితాలపై అవగాహన కల్పించారు. ఆపదలో డయల్ 112, 1930, 1972 సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.


