ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 23 వినతులు | - | Sakshi
Sakshi News home page

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 23 వినతులు

Nov 29 2025 7:47 AM | Updated on Nov 29 2025 7:47 AM

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 23 వినతులు

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 23 వినతులు

సీతంపేట: సీతంపేట ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు 23 వినతులు వచ్చాయి. ఏపీవో జి.చిన్నబాబు అర్జీలు స్వీకరించారు. బీఎస్‌సీ నర్సింగ్‌ కోర్సు చేయడానికి ఆర్థిక సాయం అందించాలని పరుసరాంపురానికి చెందిన హేమలత తెలిపారు. బుడార్సింగికి చెంది న లక్ష్మీకాంతం హౌసింగ్‌ బిల్లులు చెల్లించాల న్నారు. ఆటో, మేకల లోన్‌ ఇప్పించాలని పీవీఈతమానుగూడ గ్రామస్తుడు దాసు కోరా రు. పెదరాజపురానికి చెందిన చిన్నసొంబురు కోళ్ల ఫారం పెట్టుకోవడానికి రుణం మంజూరు చేయాలని విజ్ఙప్తి చేశారు. కురసింగికి చెందిన బి.కావ్య పాలకొండ ఏరియా ఆస్పత్రిలో నర్స్‌ పోస్టు కావాలని దరఖాస్తు చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ గడువు పెంపు

విజయనగరం అర్బన్‌: రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టులు అక్రిడిటేషన్‌ కార్డుల కాలపరిమితి మరో రెండు నెలలు పాటు డిసెంబర్‌ 1 నుంచి జనవరి 31, 2026 వరకు లేదా కొత్త కార్డులు జారీ ప్రక్రియ చేయడం గానీ ఏది ముందు జరిగితే అప్పటి వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కేఎస్‌ విశ్వనాథన్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నవంబర్‌ 30 నాటికి అక్రిడిటేషన్‌ కార్డులు కలిగిన పని చేయుచున్న పాత్రికేయులకు మాత్రమే మరో రెండు నెలలు పాటు డిసెంబర్‌ 1, 2025 నుంచి జనవరి 31, 2026 వరకు ఈ పొడిగింపు సౌకర్యం వర్తిస్తుందని సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు తెలిపారు.

పార్వతీపురం: జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ కార్డుల గడువును మరో రెండు నెలలు గడువును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అక్రిడిటేషన్‌ల గడువు ఈ నెల 30తో ముగియనున్న తరుణంలో డిసెంబర్‌ 01, 2025 నుంచి జనవరి 31, 2026 వరకు లేదా కొత్తకార్డులు జారీ ప్రక్రియ చేయడంగానీ ఏది ముందు జరిగితే అప్పటి వరకు పొడిగింపు ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం అక్రిడిటేషన్లు వున్న వారికి మాత్రమే పొడిగింపు నిబంధన వర్తిస్తుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

యువకుల మధ్య కొట్లాట

పాలకొండ: పట్టణంలోని గాయత్రి దేవి ఆలయ సమీపంలో శుక్రవారం సాయంత్రం యువకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. రెండు గ్రూపులకు చెందిన యువకులు మధ్య ఉన్న విభేదాలు కొట్లాటకు దారి తీశాయి. ఇందులో కోటిపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్‌కు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి ట్రైనీ ఎస్సై హేమలత తెలిపిన వివరాలు.. రెండు గ్రూపులకు చెందిన యువకుల మధ్య వివాదం గొడవకు దారి తీసిందని తెలిపారు. ఈ గోడవలో మండలంలోని కోటిపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్‌కు గాయాలు కాగా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని వివరించారు. తనను రాంబాబు అనే యువకుడు గాయపరిచినట్టు తెలిపారని దీనిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ గొడవ వద్దని సర్ది చెప్పిన పట్టణానికి చెందిన గణపతికి చేతిపై కూడా గాయం అయిందని తెలిపారు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసును పరిశీలిస్తున్నామని వివరించారు.

పాము కాటుతో

ముగ్గురికి అస్వస్థత

సీతంపేట: మండలంలోని పలు గ్రామాలకు చెందిన ముగ్గురు శుక్రవారం పాముకాట్లకు గురై స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేరారు. పొంజాడకు గ్రామస్తురాలు సవర సుభాషిణి, బుడగరాయికి చెందిన సవర లక్ష్మి, ముత్యాలుకు చెందిన సవర గంగమ్మకు పాము కాట్లు వేయడంతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్టు సూపరింటెండెంట్‌ బి.శ్రీనివాసరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement