ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలి
● విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ● బాలిక, బాలుర ఆశ్రమ పాఠశాలల సందర్శన
పాలకొండ/సీతంపేట/భామిని: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ వి.విజయరామరాజు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పాలకొండ నియోజకవర్గంలోని సీతంపేట గిరిజన సంక్షేమ బాలురు, బాలికల ఆశ్రమ పాఠశాల, భామిని మో డల్ స్కూల్/కాలేజీ, పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శుక్రవారం సందర్శించారు. విద్యార్థుల తో మాట్లాడారు. అభ్యసనా సామర్థ్యాలను పరీక్షించారు. సిలబస్ పూర్తి, సదుపాయాలపై ఆరా తీశా రు. పదో తరగతిలో ఏ ఒక్కరూ ఫెయిల్ కాకూడద ని సూచించారు. మెరుగైన విద్యాబోధన అందించా లని ఉపాధ్యాయులను ఆదేశించారు. వచ్చేనెల 5వ తేదీ నుంచి చేపట్టనున్న మెగా టీచర్స్–పేరెంట్స్‌డే ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ పాల్గొననున్న కార్యక్రమంపై చర్చించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకరరెడ్డి, పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ పవార్‌స్వప్నిల్ జగన్నాథ్, ఏపీఓ చిన్నబాబు, డీఈఓ రాజ్‌కుమార్, డిప్యూటీ ఈఓ కృష్ణమూర్తి, ప్రిన్సిపాళ్లు, ఎంఈఓలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.


