మట్టిపరీక్షల నివేదికలు రైతులకు అందాలి
పాలకొండ రూరల్: మట్టి నమూనా పరీక్షల నివేదికలు రైతులకు క్షేత్రస్థాయి అందేలా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్ అదనపు డైరెక్టర్ వి.వి.విజయలక్ష్మి శుక్రవారం అధికారులను ఆదేశించారు. పాలకొండ మండ లం పద్మాపురంలో రైతులతో శుక్రవారం మాట్లాడారు. రైతులకోసం ఐదు కార్యాచరణ విధానాలను వివరించారు. ఫార్మర్ యాప్, వ్యవసాయ యాంత్రీకరణ సర్వేయాప్, మట్టి నమూనాల పత్రాల వివరాలను రైతులకు తెలియజేశారు. డైరెక్టర్ వెంట శ్రీకాకుళం జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ సీహెచ్ వెంకటరావు, ఎంఏఓ ఎస్.ఎస్.ఆర్.వి.ప్రసాదరావు ఉన్నారు.
పార్వతీపురం: ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల గ్రీవెన్స్‌ను శుక్రవారం నిర్వహించారు. వివిధ శాఖల నుంచి 36 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను సకాలంలో పరిష్కరించేలా అధికారులను ఆదేశించామన్నారు. ప్రత్యేక గ్రీవెన్స్‌తో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత, జిల్లా ఖజనా అధికారి ఆర్‌ఎఎస్ కుమార్, కలెక్టర్ కార్యాలయ హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
వంగర: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కాంబోతుల రమణ పనితీరుపై చీపురుపల్లి డిప్యూటీ ఈఓ కె.వి.రమణమూర్తి శుక్రవారం విచారణ జరిపారు. ఓ ప్రైవేటు పాఠశాలలో చేరాలంటూ ఉపాధ్యాయుడు సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రచారంపై రేగిడి మండలం చినశిర్లాం గ్రామానికి చెందిన మజ్జి శ్రీనివాసరావు జిల్లా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిప్యూటీ ఈఓ శుక్రవారం పాఠశాలకు వచ్చి ఫిర్యాదుదారు నుంచి వివరాలు సేకరించారు. సమగ్ర నివేదిక ఉన్నతాధికారులకు అందజేస్తానని తెలిపారు. ఆయన వెంట ఎంఈటో–2 మీసాల కూర్మినాయుడు ఉన్నారు.
మట్టిపరీక్షల నివేదికలు రైతులకు అందాలి


