● ట్రైకార్ ఎం.డి. మణికుమార్ ● డీడీ, ఐటీడీఏ ఏపీఓలపై వచ
పార్వతీపురం: కలెక్టర్ కార్యాలయంలోని పీజీ ఆర్‌ఎస్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రభుత్వ, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు తమ సర్వీస్‌కు సంబంధించిన ఫిర్యాదులు, పింఛన్, టెర్మినల్ బెనిఫిట్స్, పెండింగ్ విషయాలను విన్నవించేందుకు గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు గ్రీవెన్స్‌సెల్‌కు హాజరుకావాలని సూచించారు.
కురుపాం: గిరిజనులను డోలీ కష్టాలు వీడడం లేదు. కురుపాం మండలం ఒబ్బంగి పంచాయతీలోని తోలుంగూడ గ్రామానికి చెందిన మండంగి కంబప్పు అనే వృద్ధుడు తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆయనను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి డోలీలో తోలుంగూడ గ్రామం నుంచి సుమారు మూడు కిలోమీటర్ల మేర మోసుకుని నీలకంఠాపురం పీహెచ్‌సీకి తరలించారు. తోలుంగూడ రోడ్డు అధ్వా నంగా ఉందని, రాకపోకలకు అవస్థలు పడుతున్నామని నాయకులు, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు.
సీతంపేట: ఆరోపణలు చేసిన వారు తప్పనిసరిగా తగిన ఆధారాలు చూపించాలని ట్రైకార్ ఎం.డి. మణికుమార్ స్పష్టం చేశారు. ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, ఏపీఓ చిన్నబాబు, సూపరింటెండెంట్ దేశ్‌పై వచ్చిన ఫిర్యాదుపై గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం స్థానిక ఐటీడీఏలోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ప్రాథమిక విచారణ జరిపారు. వివిధ ఫైళ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ దళిత సంఘాల సంయక్త మండలి నాయకులు గణేష్, ప్రభాకర్, రాంబాబు, గోవింద్‌లు డీడీపై 7, ఏపీఓపై 12 ఫిర్యాదులు చేశారన్నారు. ఇరువర్గాల నుంచి ఆధారాలు సేకరించి ఫైల్స్ పరిశీలిస్తామన్నారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమపాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, డిప్యుటేషన్‌లలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు, పాఠశాలల్లో కిటికీలకు మెస్‌లు వేసే క్రమంలో అవకతవకలకు పాల్పడ్డారని, మరికొన్ని ఫిర్యాదులు చేశారన్నారు. డిప్యుటేషన్, బదిలీల ఫైళ్లు పరిశీలించానని, వీటిలో ప్రతిచోట పీఓ సంతకాలు, సూచనలు ఉన్నాయన్నారు. ఫిర్యాదు దారులు విచారణకు హాజరయ్యేందుకు మరోసారి అవకాశం ఇస్తామన్నారు.


