ఆర్థిక లావాదేవీలపై పోలీసుల ఆరా
● పుట్టగొడుగుల కేంద్రం నిర్వాహకుడిని పిలిపించిన పోలీసులు ● పూర్తిస్థాయిలో దర్యాప్తు
పాలకొండ: పాలకొండ నగర పంచాయతీ కేంద్రంగా నిర్వహిస్తున్న పుట్టగొడుగుల కేంద్రంలో జరుగుతున్న ఆర్థిక వ్యవహారాలపై ‘నిరుద్యోగులూ జాగ్ర త్త’ అనే శీర్షికన గురువారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై పోలీసు వర్గాలు స్పందించాయి. పుట్టగొడుగుల కేంద్రం నిర్వాహకుడుని పాలకొండ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. పుట్టగొడుగుల కేంద్రంలో పనిలో చేరిన వారి నుంచి డిపాజిట్ల వసూళ్లపై నిర్వాహకుడిని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరా తీశారు. ఈ వ్యవహారంపై డిపాజిట్ దారుల తో మాట్లాడి మరో ఆర్థిక నేరం జరగకుండా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ ప్రయోగమూర్తి తెలిపారు.
ఆర్థిక లావాదేవీలపై పోలీసుల ఆరా


