ధాన్యం దళారుల పాలు
ధాన్యం కొనుగోళ్లలో దళారులు, మిల్లర్లు కీలక పా త్ర పోషిస్తున్నారన్న విమర్శలున్నాయి. రంగు మారిందని.. తేమశాతం ఎక్కువనీ దళారులు రూ. 1,400 నుంచి రూ.1,600 మధ్య రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసుకుంటున్నారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు తెరవక, గత ఏడాది చాలావరకు రైతులు దళారుల బారినపడ్డారు. ప్రస్తుతం కూ డా కోతలు పూర్తయినా ఇంకా కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో తెరుచుకోని పరిస్థితి. జిల్లాలో 2.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. నవంబర్ చివరి వారం వచ్చినా ఇంకా మందకొడిగానే ప్రక్రియ సాగుతోంది. మొక్కజొన్న, పత్తి పంటలదీ ఇదే పరిస్థితి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఆదుకోక, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.


