జాతీయ కబడ్డీ జట్టు కెప్టెన్‌గా సుమంత్
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న కబడ్డీ పోటీలకు విజయనగరం జిల్లాకు చెందిన సుమంత్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈనెల 27 నుంచి హర్యానాలో జరగనున్న సబ్ జూనియర్స్ బాలుర అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే ఆంధ్రప్రదేశ్ జట్టుకు నాయకత్వ బాధ్యతలు వహించనున్నాడు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సుమంత్ ఈ అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ కబడ్డీ జట్టు కెప్టెన్‌గా ఎంపికై న సుమంత్‌ను ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు కె. ప్రభావతి, కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు రంగారావుదొర, ఆర్గనైజింగ్ కార్యదర్శి నడిపేన లక్ష్మణరావు అభినందించారు. జాతీయ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.
జాతీయస్థాయి పోటీలకు రెల్లివలస విద్యార్థి
పూసపాటిరేగ: మండలంలోని రెల్లివలస జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల విద్యార్థి జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై ంది. పాఠశాలకు చెందిన ఎనిమిదివ తరగతి విద్యార్థి ఇజ్జరోతు హర్షిణి విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–14 కబడ్డీ విభాగంలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. పాఠశాల విద్యార్థిని జాతీయస్థాయి పోటీలకు ఎంపికవడంతో హెచ్‌ఎం బి.శంకర్రావు, ఉపాధ్యాయులు అభినందించారు.
డిసెంబర్ 7న స్కాలర్‌షిప్ పరీక్ష
● 28లోగా సీఎస్, డీఓల జాబితా ఇవ్వండి
● డీఈఓ బి.రాజ్‌కుమార్
పార్వతీపురం రూరల్: జిల్లాలో డిసెంబరు 7న నిర్వహించనున్న జాతీయ ఉపకార వేతనాల (ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్) పరీక్షకు విద్యాశాఖ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పరీక్ష నిర్వహణలో కీలకమైన చీఫ్ సూపరింటెండెంట్లు(సీఎస్), డీఓల నియామక ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని డీఈఓ బి.రాజ్‌కుమార్ ఆదేశించారు. దీనిపై పార్వతీపురం, పాలకొండ డిప్యూటీ ఈఓలు తక్షణమే స్పందించి, ఈ నెల 28వ తేదీ లోపు ప్రతిపాదనలు పంపాలని గడువు విధించారు. గడువులోగా జాబితాలు పంపకపోతే చర్యలు తప్పవని పరోక్షంగా హెచ్చరించారు.
కొమరాడ: మండలంలోని ఉలిపిరి పంచాయతీ అల్లువాడ గ్రామానికి చెందిన బిడ్డిక సతీష్(26)చెట్టుపై నుంచి జారి పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామ సమీపంలో ఉన్నా జీలుగు చెట్టు వద్దకు మంగళవారం సాయత్రం కల్లు తీయడానికి వెళ్లాడని కల్లు తీస్తున్న క్రమంలో చెట్టుపైనుంచి జారి పడిపోవడంతో తలకు త్రీవగాయాలయ్యయి. దీంతో వెంటనే కూనేరు రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారడు ఉన్నారు. ఈ ఘటనపై ఎస్సై కె.నీలకంఠం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు.
పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య
గజపతినగరం: మండలంలోని భూదేవి పేట గ్రామానికి చెందిన జగ్గినేని గౌరి(42) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గౌరి కాలికి దెబ్బతగలడంతో బాధపడుతూ ఉంది. దీనికి తోడు కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ తాళలేక మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి పురుగు మందు తాగేసింది. దీంతో బంధువులు విజయనగరంలోని సర్వజన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. గౌరి కుమార్తె పూజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
జాతీయ కబడ్డీ జట్టు కెప్టెన్‌గా సుమంత్
జాతీయ కబడ్డీ జట్టు కెప్టెన్‌గా సుమంత్


