అర్ధరాత్రి తనిఖీలు
నాగావళి తీరంలో
పాలకొండ రూరల్: ఉచితం మాటున సాగుతున్న ఇసుక అక్రమ దందాపై అధికారులు కొరడా ఝుళిపించారు. నాగా వళి తీరంలో పాలకొండ, పార్వతీపురం సబ్ కలెక్టర్లు పవర్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్.వైశాలి సోమవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు జరిపారు. మంగళాపురం సమీపంలో నదీ గర్భంలో ఇసుక తవ్వకాల కోసం ఉంచిన జేసీబీని సీజ్ చేశారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారిక పార్టీ నాయకుల అండదండలతో మండలంలోని చిన మంగళాపురం– యరకారాయపురంతో పాటు తీరం వెంబడి పలు గ్రామాల వద్ద నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై ‘సాక్షి’లో వరుసగా కథనా లు ప్రచురితమయ్యాయి. ఇదే అంశమై బాధిత గ్రామాల ప్రజలు కూడా ఇటీవల అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదుచేశారు. దీనిపై స్పందించిన సబ్ కలెక్టర్ పవర్ స్వప్నల్ జగన్నాథ్ ఆకస్మిక తనిఖీలు చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సెల్‌లైట్ వెలుగులో దారి చూపిస్తూ..
విధి నిర్వహణలో నిత్యం తలమునకలై ఉండే పవర్ స్వప్నిల్ జగన్నాథ్ (ఐఏఎస్) అక్రమా ర్కుల బరతం పట్టే క్రమంలో విపరీతమైన చలిని కూడా లెక్క చేయకుండా అర్ధరాత్రి చేపట్టిన తనిఖీలను తీర గ్రామాల ప్రజలు స్వాగతించారు. చిమ్మ చీకటిలో కేవలం సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో సబ్ కలెక్టర్‌కు భార్య అయిన మరో సబ్‌కలెక్టర్ వైశాలి దారిచూపిస్తూ విధుల్లో అండగా నిలవడాన్ని చూసి స్థానికులు నివ్వెరపోయారు. ప్రజలకు మంచి చేయడంలో వారు చూపిస్తున్న చిత్తశుద్ధిని ప్రశంసించారు. తనిఖీల్లో ఎస్‌ఐ కె.ప్రయోగమూర్తి, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు ఎన్ని బాబ్జినాయుడు, పొగిరి కృష్ణమూర్తి, డొంక దాసు, బి.జ్ఞానరావు, పి.నర్సుంహులు నాయుడు, పి.రాజేష్ పాల్గొన్నారు.
ఇసుక అక్రమ తరలింపుపై కొరడా ఝళిపించిన సబ్‌కలెక్టర్
రాత్రి 12 గంటల సమయంలో జేసీబీ సీజ్
నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలకు ఆదేశాలు
అర్ధరాత్రి తనిఖీలు
అర్ధరాత్రి తనిఖీలు


