ఘనంగా సౌతిండియా బాప్టిస్ట్ చర్చి వార్షికోత్సవం
● సెమీ క్రిస్‌మస్‌లో పాల్గొన్న రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల పాస్టర్‌లు
విజయనగరం టౌన్: సౌతిండియా బాప్టిస్ట్ చర్చెస్ పదో వార్షికోత్సవాన్ని స్థానిక సిమ్స్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి పాస్టర్‌లు అధిక సంఖ్యలో పాల్గొని దైవసందేశాన్ని అందజేశారు. సంఘమిత్ర ఆర్‌ఎస్.జాన్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్త రాయబారులతో సమావేశం నిర్వహించారు. రెవరెండ్ డాక్టర్ డీజే.నిరంజన్‌బాబు (హనుమకొండ), డాక్టర్ బొంత శామ్యూల్‌సన్ (హైదరాబాద్) తదితరులు దైవసందేశం ఇచ్చారు. సాయంత్రం విలియం కేరీ డయాస్ వద్ద సెమీ క్రిస్‌మస్ వేడుకలను నిర్వహించారు. రెవరెండ్ డాక్టర్ ఎం.రామయ్య (బెంగళూర్) కేక్ కటింగ్ చేశారు. రెవరెండ్ డాక్టర్ ఎస్.ప్రకాష్‌రాజ్ కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో క్రీస్తు సోదరులు పాల్గొన్నారు.


