867 గంజాయి కేసుల్లో 2,467 మంది అరెస్టు | - | Sakshi
Sakshi News home page

867 గంజాయి కేసుల్లో 2,467 మంది అరెస్టు

Nov 25 2025 10:42 AM | Updated on Nov 25 2025 10:42 AM

867 గ

867 గంజాయి కేసుల్లో 2,467 మంది అరెస్టు

867 గంజాయి కేసుల్లో 2,467 మంది అరెస్టు ● విశాఖ రేంజ్‌ డీఐజీ గోపినాథ్‌ జెట్టి

మౌలిక సదుపాయాల మీద దృష్టి ‘సాక్షి’కి వెల్లడించిన కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి

గుమ్మలక్ష్మీపురం: విశాఖపట్నం రేంజ్‌ పరిధిలో గడిచిన 14 నెలల్లో నమోదైన 867 గంజాయి కేసుల్లో 2,467 మందిని అరెస్టు చేసినట్టు విశాఖరేంజ్‌ డీఐజీ గోపినాథ్‌ జెట్టి అన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఎల్విన్‌పేట పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని సోమవారం తనిఖీ చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, నమోదు, పరిష్కరిస్తున్న తీరు, శాంతిభద్రతలపై పరిరక్షణపై ఆరా తీశారు. అనంతరం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. సైబర్‌ నేరగాళ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీబీఐ, ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్‌ అధికారులంటూ ఫోన్‌, ఆన్‌లైన్‌లో డబ్బులు డిమాండ్‌ చేసినా, బెదిరించినా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఉద్యోగాల పేరుతో మోసాలు జరుగుతున్నాయని.. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఉద్యోగాలకు ముందస్తు నోటిఫికేషన్‌ వెలువడకుండా భర్తీ చేయడం కుదరదన్న సంగతిని నిరుద్యోగులు గ్రహించాలన్నారు. గంజాయి నిర్మూలనలో భాగంగా 11వేల ఎకరాల్లో రైతులతో ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయించామన్నారు.

గంజాయి నిందితుల నుంచి రూ.14 కోట్ల విలువ చేసే ఆస్తులను సీజ్‌ చేశామన్నారు. ఈనెల 12న అభ్యుదయ సైకిల్‌ యాత్రను ప్రారంభించామని, పాయకరావుపేట నుంచి ఇచ్ఛాపురం వరకు సాగే ఈ యాత్రలో అధికారులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ ప్రజలకు, విద్యార్థులకు, యువతకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఆయన వెంట ఎస్పీ ఎస్‌.వి మాధవ్‌రెడ్డి, పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, ఎల్విన్‌పేట, చినమేరంగి సీఐలు బి.హరి, తిరుపతిరావు, ఎస్‌ ఐలు బి.శివప్రసాద్‌, నీలకంఠారావు ఉన్నారు.

సాక్షిప్రతినిధి, విజయనగరం:

పార్వతీపురం మన్యం జిల్లా భౌగోళికంగా వినూత్నమైనది. ఇక్కడి ప్రకృతి సోయగాలు, వాగులు వంకలు, నదులు, కొండలు,గుట్టలు, ప్రాజెక్టులు, జలపాతాలు పర్యావరణ ప్రేమికులను, పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఈ ప్రాంతంలోని గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు జిల్లాకు తలమానికం. వీటిని అవకాశంగా మలుచుకుని ఆదాయ వనరుగా మార్చాలి. ప్రజల జీవన స్థితిగతులను మార్చాలి.. ఇదే ప్రథమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. జిల్లాలో

పర్యాటక అభివృద్ధిని ‘సాక్షి’కి తెలియజేశారు.

సాక్షి : జిల్లా ప్రజల జీవన స్థితిగతులను

పెంచేందుకు అమలుచేస్తున్న ప్రణాళిక ?

కలెక్టర్‌: జిల్లాలోని ప్రకృతిని, దాని అందచందాలను ఆదాయవనరుగా మారుస్తున్నాం. జలపాతాలను, ఇతర ప్రకృతి రమణీయతను ఆకర్షించేలా విస్తృత ప్రచారం చేస్తున్నాం. ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. ఎక్కడెక్కడి నుంచో పర్యాటకు లు వస్తున్నారు. ఇది స్థానికంగా యువతకు కొంత ఆర్థిక ఆసరాను ఇస్తుంది.

సాక్షి : స్థానికంగా ఉండేందుకు వసతి సౌక ర్యం లేదు.. దీనిని ఎలా అధిగమిస్తారు?

కలెక్టర్‌: నిజమే.. ఈ ప్రాంతంలో పర్యాటకులు ఉండేందుకు వసతి సమస్య ఉంది. దానిని అధిగమించేందుకు హోమ్‌ స్టే విధానాన్ని పరిచయం చేస్తున్నాం. ఔత్సాహిక పర్యాటకులు గిరిజనుల ఇళ్లవద్ద ఉండేలా ప్రచారం చేస్తున్నాం. దీనివల్ల నగర జీవనానికి అలవాటు పడిన పర్యాటకులకు సరికొత్త అనుభూతి కలుగుతుంది. ఇటు గిరిజనులకు కాస్త ఆదాయం లభిస్తుంది.

సాక్షి : పర్యాటకంతో పాటు ఇతర ఆదాయమార్గాలేమైనా ఉన్నాయా?

కలెక్టర్‌: పర్యాటకం అనేది సీజనల్‌.. ఈ మూడు నెలలు ఉంటుంది. ఆ తరువాత కూడా గిరిజను ల ఆదాయాన్ని సుస్థిరం చేసేందుకు పలు ప్రతి పాదనలు ఉన్నాయి. డెయిరీ, ఫిషరీస్‌ వంటి రంగాల్లో వారిని ప్రోత్సహిస్తున్నాం. మామిడి, అనాస వంటి పండ్ల నుంచి గుజ్జును తీసే కుటీర పరిశ్రమలను సైతం ప్రోత్సహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. దీనికి బ్యాంకులనుంచి రుణాలు అందించేందుకు కృషి చేస్తాం.. దాదాపు 5000 కుటుంబాలను ఇందులో భాగస్వాములను చేయాలన్నది లక్ష్యం.

సాక్షి : పరిశ్రమల ఏర్పాటు వంటిది ఏమైనా ఉందా ?

కలెక్టర్‌: పార్వతీపురంలో జీడిపిక్కల పరిశ్రమకు పూర్తి అనుమతులు తీసుకొచ్చి అది సాఫీగా నడిచేలా ప్రోత్సహిస్తున్నాం. వీటికితోడు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం.

సాక్షి : హాస్టల్‌ విద్యార్థుల మరణాలు.. అనారోగ్య పరిస్థితులను ఎలా అదుపు చేస్తున్నారు.?

కలెక్టర్‌: మొదట్లో విద్యార్థులు జ్వరాలు.. ఇతర అనారోగ్య సమస్యలకు గురైంది వాస్తవమే. దీనికి వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం ప్రధాన కారణం. అందుకే ఇప్పుడు ‘ముస్తాబు’ అనే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా జిల్లాలో అమలుచేస్తున్నాం. పిల్లలు శుభ్రంగా చేతులు కడుక్కున్నాకే భోజనం పెట్టాలని హాస్టల్‌ వార్డెన్లకు సూచనలిచ్చాం. రోజూ పరిశుభ్రంగా స్నానం చేసి ఉతికిన దుస్తులు వేసుకునేలా చూడాలన్నది కూడా ఇందులో భాగం చేశాం. ఈ రెండు కచ్చితంగా అమలు చేయడం ద్వారా నేడు హాస్టల్‌ పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తగ్గాయి.

సాక్షి : కొత్త ప్రాంతాలు ఏమైనా

అభివృద్ధి చేస్తున్నారా ?

కలెక్టర్‌: సీతంపేటలోని అడ్వెంచర్‌ పార్కును అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షిస్తున్నాం. అడలి వ్యూ పాయింట్‌ కూడా మరో పర్యాటక స్థలంగా మారింది. ఇవన్నీ మన జిల్లాకు కొత్త రూపును తీసుకొస్తున్నాయి.

867 గంజాయి కేసుల్లో 2,467 మంది అరెస్టు 1
1/3

867 గంజాయి కేసుల్లో 2,467 మంది అరెస్టు

867 గంజాయి కేసుల్లో 2,467 మంది అరెస్టు 2
2/3

867 గంజాయి కేసుల్లో 2,467 మంది అరెస్టు

867 గంజాయి కేసుల్లో 2,467 మంది అరెస్టు 3
3/3

867 గంజాయి కేసుల్లో 2,467 మంది అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement