ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాడతాం
● 18 నెలల్లో ఏ ఒక్కరికై నా కొత్త పింఛన్, ఇల్లు ఇచ్చారా? ● రైతులకు అన్నదాత సుఖీభవలో కోత ● టీడీపీ ప్రభుత్వ తీరును ప్రశ్నించిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
సాలూరు రూరల్: ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి పోరాడుతామని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివారసరావు స్పష్టంచేశారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభు త్వం ఏర్పడిన 18 నెలల్లో ఏ ఒక్క పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. కొత్తగా ఒకరికి కూడా ఇల్లు, పింఛన్ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. అన్నదాత సుఖీవ పథకానికి చంద్రబాబు ప్రభు త్వం కోత పెట్టిందన్నారు. కౌలు రైతులను పూర్తిగా విస్మరించిందని తెలిపారు. గతంలో 18 నెలల కాలంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చి 1.60 లక్షల ఉద్యోగాలు కల్పించారన్నారు. 10 సెంట్లు ఉన్నవారి కి కూడా గతంలో రైతుభరోసా నిధులు జమయ్యేవ ని గుర్తుచేశారు. మన్యంలో విద్యార్థులు మరణిస్తు న్నా ఆదుకునే చర్యలు లేవన్నారు. పేద కుటుంబా ల పిల్లలకు వైద్యవిద్య, ప్రజలకు వైద్యం అందకుండా ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందు కు పూనుకున్నారన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర సాలూరుకు 100 పడకల ఆస్పత్రి తీసుకొచ్చి పను లు పూర్తిచేస్తే.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం కనీసం ప్రారంభించలేకపోతుందన్నారు. ఇక్కడి మంత్రి చోద్యం చూస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటీకరణ చేసేయండి
ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేటీకరించేందుకు పూనుకున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వం... సీఎం, మంత్రులు, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేల పదవులను కూడా ప్రైవేటీకరణ చేస్తారా అంటూ మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఎద్దేవా చేశారు. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేని దౌర్భాగ్యం చంద్రబాబునాయుడి ప్రభుత్వానిదేనన్నారు. పత్తి, మొక్కజొన్న పంటను కొనుగోలుచేసేవారు లేక పంటను దళారులకు విక్రయిస్తున్నారన్నారు. చంద్రంపేట రైతులు పత్తిని క్వింటా కేవలం రూ.5వేలకు విక్రయించి రూ.3వేల నుంచి రూ.4వేల వరకు నష్టపోతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 53.58 లక్షల మంది రైతులకు ఉచిత బీమా ప్రీమియం చెల్లించి విపత్తుల సమయంలో ఆదుకున్న ఘనత జగన్‌మోహనరెడ్డికే చెందుతుందన్నారు.


