కాలువలో జారిపడి విద్యార్థి మృతి
గరుగుబిల్లి: ప్రమాదవశాత్తు కాలుజారి తోటపల్లి ప్రాజెక్టు ఎడమ కాలువలో పడిపోయిన విద్యార్థి మృతిచెందాడు. హెచ్‌సీ ఎన్.ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. గరుగుబిల్లి మండలం తోటపల్లి పంచాయతీ నందివానివలస గ్రామానికి చెందిన రెడ్డి మణికంఠ (17) సోమవారం ఉదయం తనస్నేహితులతో కలిసి రన్నింగ్‌కు వెళ్లాడు. అనంతరం స్నానానికి ఎడమ కాలువలో దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడిపోయాడు. స్నేహితుల సమచారంతో స్థానికులు వెంటనే మణికంఠను బయటకు తీసి ప్రథమ చికిత్సచేశారు. ఇంటికి తరలిస్తుండగా చనిపోయాడు. మృతుడు కురుపాం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. మృతుడికి తండ్రి సింహాచలం, తల్లి చిన్నమ్మలు, అక్క జయశ్రీ ఉన్నారు. పోలీసులు కేసు నమోదుచేశారు. ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదం అలముకుంది.


