మార్షల్ ఆర్ట్స్‌లో పతకాలు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో విజయనగరం క్రీడాకారులు సత్తా చాటారు. ఈనెల 23న శ్రీకాకుళం జిల్లాలో జరిగిన పోటీల్లో ముగ్గురు క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు దక్కించుకున్నారు. పోటీల్లో ఎన్.ప్రసాద్ 60కేజీల విభాగంలో బంగారు పతకం దక్కించుకోగా..కె.కృష్ణ భగవాన్ 70 కేజీల విభాగంలో వెండి పతకం, ఆజయ్ జీవన్ 50 కేజీల విభాగంలో వెండి పతకం సాధించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన క్రీడాకారులను కోచ్ రాజేష్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం.కూర్మారావు, ఎస్.అనిల్‌లు అభినందించారు.


