అర్జీలు వెంటనే పరిష్కరించాలి
● కలెక్టర్ ప్రభాకరరెడ్డి
పార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో అందిన అర్జీలు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు వివిధ ప్రాంతాల నుంచి 92 వినతులు అందాయి. అర్జీలను స్వీకరించినవారిలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, డీఆర్‌ఓ కె.హేమలత, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి తదితరులున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి
జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా, మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండేలా చేసేందుకు ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. సోమవారం పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా కార్యాలయాల ప్రాంగణాలు, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, అందుబాటులో ఉన్న పనికిరాని వస్తువులను, పాతఫైళ్లను వెంటనే డిస్పోజ్ చేయాలని సూచించారు. ప్రతి కార్యాలయంలో ఉద్యోగులు, ప్రజలు వినియోగిం చుకునేందుకు మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండాల న్నారు. ఉన్నతాధికారులు తమ పరిధిలోని కార్యాలయాలను స్వయంగా పరిశీలించి, పనితీరును పరిశీలించి, అవసరమైన సూచనలు అందించాలని కోరారు.
ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 4 ఫిర్యాదులు
పార్వతీపురం రూరల్: జిల్లా పోలీసుశాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా విని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఏఎస్పీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఆయన నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లాలో ఉన్న పలు స్టేషన్ల పరిధిలలో నుంచి వచ్చిన నలుగురు ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ఏఎస్పీ ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. వచ్చిన ఫిర్యాదులు వాస్తవాలు అయినట్‌లైతే చట్టపరిధిలో చర్యలు చేపట్టి తీసుకున్న చర్యల నివేదికను జిల్లా పోలీసుశాఖ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ ఎస్సై రమేష్‌నాయుడు, తదితర సిబ్బంది ఉన్నారు.
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 97 వినతులు
సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 97 వినతులు వచ్చాయి. ఏపీఓ ఎస్‌వి గణేష్, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈ రమాదేవి అర్జీలు స్వీకరించారు. వన్‌బి అడంగల్ ఇప్పించాలని జగ్గడుగూడకు చెందిన కరువయ్య కోరారు. కోళ్లఫారం పెట్టుకోవడానికి రుణం ఇప్పించాలని మానాపురం గ్రామస్తుడు ఆరిక వినీత్ అర్జీ అందజేశాడు. దుక్కిపశువుల లోన్ ఇప్పించాలని ఎర్రన్నగూడ గ్రామస్తుడు సవర కృష్ణారావు, గ్రామంలో మినీఅంగన్‌వాడీ సెంటర్ ఏర్పాటు చేయాలని చినవంగర ప్రజానీకం కోరారు. జయపురం గ్రామానికి చెందిన అనిల్‌కుమార్ ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు. కార్యక్రమంలో డిప్యూటీఈఓ రామ్మోహన్‌రావు, జీసీసీ మేనేజర్ దాసరికృష్ణ, డీఈ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
అర్జీలు వెంటనే పరిష్కరించాలి
అర్జీలు వెంటనే పరిష్కరించాలి


