వెచ్చ..వెచ్చగా..!
పార్వతీపురం: చలికాలం వచ్చేసింది. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఈ నేపఽథ్యంలో మార్కెట్‌లోకి అందమైన స్వెటర్లు వచ్చేశాయి. రకరకాల రంగులు, ఆకర్షించే డిజైన్లలో ఉత్తరాది వ్యాపారులు తీసుకువచ్చిన ఉన్ని దుస్తుల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. శీతాకాలం కావడంతో సాయంత్రం 6 గంటలకే చలిగాలులు వీస్తున్నాయి. శీతాకాలం వస్తూ వస్తూ జిల్లా వాసులకు వెచ్చని నేస్తాలను తీసుకువచ్చింది. చలిని పారదోలేందుకు ఉన్ని దుస్తులతో టిబెటన్లు ఇక్కడికి వచ్చి వాలిపోయారు. దాదావు వంద రోజుల పాటు ఇక్కడే ఉండి, ఇక్కడి ప్రజలతో మమేకమై తమ వ్యాపారాన్ని సజావుగా చేసుకుని వెళ్లిపోతారు. దేశం కాని దేశం..భాష తెలియదు, అయినప్పటికీ ఇక్కడి ప్రజలు అందిస్తున్న సహకారంతో చాలా ఏళ్లుగా శీతాకాలంలో ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు.
మన్యంలో చలి అధికం
పార్వతీపురం మన్యం జిల్లా అంటేనే చలి ప్రదేశం. ఎక్కడా లేని విధంగా ఇక్కడ చలి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శీతాకాలం ప్రారంభంలోనే చలి ప్రభావం నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఉన్ని వస్త్రాలను ఆశ్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో స్వెట్లర్లు కొనుగోలు
వెచ్చ..వెచ్చగా..!
వెచ్చ..వెచ్చగా..!


