కాలవ్యవధిలో అర్జీల పరిష్కారం తప్పనిసరి
● జేసీ ఎస్.సేతు మాధవన్
విజయనగరం అర్బన్: కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వచ్చే వినతులను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో ఆయన సమీక్షించారు. ఆయా శాఖలవారీగా పెండింగ్‌లో ఉన్న వినతులపై ఆరా తీశారు. పెండింగ్‌కు కారణాలను తెలుసుకున్నారు. ఈ వారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి మొత్తం 206 వినతులు అందాయి. ఎప్పటిలాగే అత్యధికంగా రెవెన్యూకు సంబంధించి 94 వినతులు అందగా, డీఆర్‌డీఏకి సంబంధించి 24, సచివాలయ సేవలకు సంబంధించి 14, పంచాయతీలకు సంబంధించి 12, ఇతర శాఖలకు సంబంధించి మిగిలిన వినతులు అందాయి. వినతులను స్వీకరించిన వారిలో డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 39 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ దామోదార్ తన చాంబర్‌లో సోమవారం నిర్వహించి 39 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదు దారుల సమస్యలను ఎస్పీ శ్రద్ధగా ఆలకించారు. సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ కె. కుమార స్వామి, ఎస్సైలు ప్రభావతి, రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు.
కాలవ్యవధిలో అర్జీల పరిష్కారం తప్పనిసరి


