లైంగికదాడి కేసులో ముద్దాయికి 12 ఏళ్ల జైలు
విజయనగరం క్రైమ్: జిల్లాలోని గరివిడి పోలీస్ స్టేషన్‌లో 2019 లో నమోదైన లైంగికదాడి కేసులో ముద్దాయికి విజయనగరం 5వ ఏడీజే కం మహిళా కోర్టు న్యాయమూర్తి ఎన్.పద్మావతి 12 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.2,000 జరిమానా విదిస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ ఏఆర్ దామోదర్ సోమవారం తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. గరివిడి మండలంలోని బొండపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ 2019 సెప్టెంబర్ 19 వతేదీన తన పశువుల శాలలో పశువులకు మేత వేస్తుండగా అదే గ్రామానికి చెందిన సవిరిగాన సూర్యనారాయణ, (45) ఆ మహిళపై లైంగికదాడికి పాల్పడ్డా డు. ఈ విషయమై బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై అప్పటి గరివిడి ఎస్సై కె.కృష్ణ ప్రసా ద్ కేసు నమోదు చేయగా అప్పటి చీపురుపల్లి సీఐ సీహెచ్.రాజులు నాయుడు కేసు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు వెల్లడించారని ఎస్పీ తెలిపారు.
కొట్లాటలో 14మందికి గాయాలు
బాడంగి: మండలంలోని కోటిపల్లి గ్రామంలో ఇరుకుటుబాల మధ్య జరిగిన కొట్లాటలో 14మందికి గాయలయ్యాయని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన గులిపిల్లి సత్యం పత్తిగుడ్డిలో గొర్రెల మేతవియంలో నీలబోను, పడాల కుటుంబాల మధ్య తగాదా ఆదివారం జరిగింది. ఈ తగాదాలో ఇరు కుటుంబాల వారు కర్రలతో కొట్టుకోగా 14మందికి గాయాలయ్యాయి. నీలబోను కుటుంబానికి చెందిన ఆనంద్, పడాల కుటుంబానికి చెందిన గంగులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ ప్రసాద్ తెలిపారు.ప్రస్తుతం వారంతా స్థానిక సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారన్నారు.


