ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు
● తహసీల్దార్ రాధాకృష్ణమూర్తి
పాలకొండ రూరల్: నాగావళి నదీతీరం వెంబడి గ్రామాల్లో ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ సీహెచ్ రాధాకృష్ణమూర్తి హెచ్చరించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ‘మనల్ని ఆపేదెవరు’ శీర్షికన ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. అంపిలి, గోపాలపురం, చినమంగళాపురం తదితర గ్రామాల వద్ద నది నుంచి ఇసుక తరలించకుండా కందకాలను శనివారం తవ్వించారు. ఇసుక అక్రమంగా తరలిస్తే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు. ఆయన వెంట సీఐ ఆమిటి ప్రసాద్, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది ఉన్నారు.
ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు


