మళ్లీ అదే పాట!
తోటపల్లి ప్రాజెక్టు కింద కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణపై ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ సమావేశంలో ప్రస్తావించారు. 25 శాతంలోబడి ఉన్న పనులను రద్దు చేయాలని ప్రభుత్వం జీవో ఇవ్వడం వల్ల వేలాది మంది రైతులు నష్టపోతున్నారని తెలిపారు. జియ్యమ్మవలస, వీరఘట్టం, పాలకొండ తదితర ప్రాంతాల్లోని సాగుభూములకు జీవనాడిలాంటి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం తగదని చెప్పారు. ఈ విషయాన్ని పునఃపరిశీలించి, కాలువ ఆధునికీకరణ పనులను చేపట్టాలని కోరారు. పాలకొండలో డంపింగ్‌యార్డు సమస్య తీవ్రంగా ఉందని గుర్తు చేశారు. అప్పట్లో శ్రీకాకుళం కలెక్టర్ డంపింగ్‌యార్డు కోసం ఐదెకరాల స్థలం కూడా కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. దానిని నేటికీ వినియోగించకపోవడం వల్ల సమస్య అలానే ఉండిపోయిందని.. తక్షణమే సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు.


