చంద్రబాబు సర్కారు
మొక్కజొన్న రైతును
పట్టించుకోని
చీపురుపల్లిరూరల్(గరివిడి):
రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, పంటకు మద్ధతుధర లేక ఆర్థికంగా కుదేలవుతున్నా చంద్రబాబు ప్రభు త్వం పట్టించుకోవడంలేదంటూ శాసనమండలి విపక్ష నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. గరివిడి వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం చీపురుపల్లి నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. గ్రామా ల్లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో వరి తరువాత మొక్కజొన్న పంటనే ప్రధాన పంటగా రైతులు సాగు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయక పోవడం విచారకరమన్నారు. నెలరోజుల కిందట మొక్కజొన్న గింజలుఽ క్వింటాధర మార్కెట్లో రూ.2,400 ఉండగా ప్రస్తుతం రూ.1700 లకు పడిపోయిందన్నారు. క్వింటా దగ్గర రైతులు 7 వందల వరకు నష్టపోయారన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి, పాలకులకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేసినట్టు గుర్తుచేశారు. మార్క్ ఫెడ్‌తో పంట కొనుగోలు చేయించేవారమన్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో మాటలు తప్ప పనులు సాగడంలేదని, జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులకు సైతం రైతు సమస్యలను పట్టించుకునే తీరిక, బాధ్యత లేదన్నట్లుగా ఉన్నారని విమర్శించారు.
రైతులకు కష్టాలు తప్పడంలేదు
చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడంలేదని, ప్రస్తుతం మొక్కజొన్న సాగుచేసేవారు యూరియా, డీఏపీ కోసం దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోందని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రా ల్లో విరివిగా ఎరువులు లభించిన విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో ధీరా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బొత్స సందీప్, బొత్స అనూష, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు కె.వి.సూర్యనారాయణరాజు, పార్టీ గరివిడి మండలాధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు వాకాడ శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ కొణిశ కృష్ణంనాయడు, పార్టీ చీపురుపల్లి మండలాధ్యక్షుడు ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచారకార్యదర్శి వి.శ్రీనివాసులనాయుడు పాల్గొన్నారు.
పంటకు లభించని మద్దతు ధర
కొనుగోలు కేంద్రాలు లేక అవస్థలు
జిల్లాలో వరి తరువాత మొక్కజొన్నే ప్రధాన పంట
నష్టపోయిన రైతులను అలాగే
వదిలేస్తారా?
ప్రభుత్వానికి, పాలకులకు బాధ్యత లేదా?
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
శాసనమండలి విపక్ష నేత
బొత్స సత్యనారాయణ


