కనిపించని హరి..
● హరి ఏనుగు ఏమైనట్టు? ● ఉన్నట్లా..? లేక ఎవరైనా మట్టుపెట్టినట్టా..?
కురుపాం: హరి ఏనుగు జాడ కొన్నాళ్లుగా కానరావ డం లేదు. అసలు ఉన్నాట్టా..? లేక ఎవరైనా మట్టు పెట్టారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నా యి. అన్ని ఏనుగుల్లో హరి ఏనుగు చాలా తెలివైనది. కొన్ని సంవత్సరాలుగా తాగునీరు, ఆహార పంటలు సమృద్ధిగా లభించే కురుపాం నియోజకవర్గంలో సంచరించేది. పదేళ్లుగా నియోజకవర్గంలో కలియతిరుగుతున్న ఏనుగుల గుంపులోని ఒక గున్న ఏనుగును హరి అని అటవీశాఖ సిబ్బందిలో కేర్ టేకర్స్ ఒకరు పేరుపెట్టి వాటిని మచ్చిక చేసుకున్నారు. హరి ఏనుగు మనుషులు, స్థానిక ప్రజలు, అటవీశాఖ సిబ్బంది, కేర్ టేకర్స్‌తో కలియతిరుగుతుండేది. కొన్ని నెలలుగా హరిజాడ కానరావడం లేదు. అటవీశాఖ అధికారులు స్పందించి హరి ఏనుగు జాడ వెంటనే తెలియజేయాలని కోరుతున్నారు.


