బైక్ దొంగ అరెస్టు
బొండపల్లి: వరుసగా బైక్‌ల దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విజయనగరం పట్టణానికి చెందిన పడాల జనార్దన్‌తో పాటు ఏడుగురు ముఠా సభ్యులు గ్రూపుగా ఏర్పడి తాళం వేసిన ఇళ్లల్లో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను గుర్తించి చోరీకి పాల్పడుతున్నట్టు తెలిపారు. వీరు ఇప్పటి వరకు నాలుగు బైక్‌లను దొంగలించినట్టు గుర్తించామని చెప్పారు. ప్రధాన నిందితుడు జనార్దన్‌ను సాంకేతిక సహాయంతో బొండపల్లి సమీపంలో ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈయనకు సహకరించిన ముగ్గురు మైనర్లను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. సమావేశంలో సీఐ జీఏవీ రమణ, ఎస్‌ఐ యు.మహేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


