ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 35 వినతులు
సీతంపేట: స్థానిక ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ గ్రామాలకు చెందిన వ్యక్తిగత, సామాజిక, ఆర్థికపరమైన సమస్యలు 35 వినతులు వచ్చాయి. ఏపీవో ఎస్‌వీ గణేష్ వినతులు స్వీకరించారు. భామిని మండలం చింతలగూడకు చెందిన వి.బుచ్చిబాబు పవర్ టిల్లర్ ఇప్పించాలని కోరారు. వెంకటిగూడ గ్రామస్తుడు పల్గుణరావు పౌల్ట్రీఫారం పెట్టుకోవడానికి రుణం ఇప్పించాలన్నారు. తమ గ్రామానికి సీసీ రోడ్డు మంజూరు చేయాలని మొగదారగూడ గిరిజనులు కోరారు. బూతలగూడకు చెందిన సవర సునీల్ భూ విస్తీర్ణం సరి చేయాలని వినతి ఇచ్చారు. డీడీ అన్నదొర, డిప్యూటీ ఈవో రామ్మోహన్‌రావు, ఏపీడీ శ్రీహరిరావు, డీపీఎం రమణ, డీఈ నాగభూషనరావు తదితరులు పాల్గొన్నారు.


