విజయనగరం టౌన్: స్థానిక శ్రీపైడితల్లి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పనుల దృష్ట్యా భక్తుల దైవదర్శనానికి ఇబ్బంది కలగకుండా చదురుగుడి పక్కనే బాలాలయం నిర్మించి, అందులో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇదిలా ఉండగా ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా శుక్రవారం ఆలయానికి ఇరువైపులా ఉన్న గోడలను తొలగించారు. అంతరాలయంతో పాటు వెనుక ఉన్న ప్రహరీని కూడా తొలగించారు. 1.80 కోట్ల వ్యయంతో వచ్చే ఏడాది అమ్మవారి పండగలోపు ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.


