జిల్లా ఖోఖో అసోసియేషన్ నూతన కార్యవర్గం
విజయనగరం: జిల్లా ఖోఖో అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. నగరంలోని కో ప్రైవేటు హోటల్‌లో జరిగిన ఎన్నికల్లో అసోసియేషన్ చైర్మన్‌గా పెనుమజ్జి విజయలక్ష్మి, అధ్యక్షులుగా ఎఎంఎన్.కమలనాభరావు, ప్రధాన కార్యదర్శిగా కె.గోపాలరావు, కోశాధికారిగా ఎస్‌హెచ్.ప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బి.మల్లికార్జునరావు, గౌరవ అధ్యక్షులుగా పి.చిన్నంనాయుడు ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా ఆంధ్రా ఖోఖో అసోసియేషన్ ప్రతినిధి సిహెచ్.నాగభూషణం, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్.వేణుగోపాలరావు, న్యాయవాది ఎ.మోహనరావు పాల్గొన్నారు.
రాష్ట్ర స్విమ్మింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న స్విమ్మింగ్ పోటీలకు జిల్లా జట్లు ఎంపిక పూర్తయింది. జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని కంటోన్మెంట్ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన ఎంపికల్లో సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగాల్లో ఎంపికలు నిర్వహించారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 22 నుంచి 23వ తేదీ వరకు విశాఖలో జరగనున్న అంతర్ జిల్లాల పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్టు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్.వేణుగోపాలరావు తెలిపారు. ఎంపిక పోటీలను అసోసియేషన్ కార్యదర్శి జి.ఆదిలింగం, కోచ్‌లు ఎల్.శ్రీను, కె.శ్రీనివాస్ పర్యవేక్షించారు.
నేడు కలెక్టరేట్‌లో
ప్రత్యేక వైద్య శిబిరం
పార్వతీపురం రూరల్: ఉద్యోగ బాధ్యతల్లో నిమగ్నమయ్యే ప్రభుత్వ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో శనివారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించన్నుట్టు జిల్లా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కలెక్టరేట్, ఐటీడీఏ, సబ్ కలెక్టర్ కార్యాలయాల సిబ్బంది కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. జనరల్ మెడిసిన్, సర్జికల్, ఆర్థో, ఈఎన్టీ, గైనకాలజీ, కంటి, దంత, చర్మ వ్యాధుల నిపుణులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఈసీజీ, ల్యాబ్ పరీక్షలతో పాటు ఆభా ఐడీలను అక్కడికక్కడే నమోదు చేస్తారని, స్కానింగ్(ఎక్స్‌రే, స్కానింగ్) అవసరమైన వారికి జిల్లా ఆస్పత్రిలో సేవలు అందిస్తారన్నారు.
విజయనగరం క్రైమ్: విజయనగరం టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి రింగురోడ్డు వద్ద శుక్రవారం పదో తరగతి విద్యార్థి రాకేష్ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. చదువు ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. అయితే అటు తల్లిదండ్రులుగాని, స్కూల్ యాజమాన్యంగాని పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఆత్మహత్యకు గల కారణాలను పూర్తిగా తెలియాల్సి ఉంది. రాకేష్ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదే విషయమై టూటౌన్ సీఐ శ్రీనివాస్‌ను వివరణ కోరగా ఇంతవరకు ఫిర్యాదు అందలేదన్నారు.
పురుగుల మందు తాగి
వృద్ధురాలి మృతి
రామభద్ర
పురం: మండలంలోని పాతరేగ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు గురువారం పురుగుల మందు తాగి విజయనగరం ఆస్రత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పాతరేగ గ్రామానికి చెందిన ఇల్లా అప్పయ్యమ్మ (70)కు ఇద్దరు కొడుకులు,ఇ ద్దరు కుమార్తెలు. అందరికీ వివాహాలు చేసింది. అయితే కొద్ది రోజులు చిన్న కొడుకు వద్ద ఉండేది. ఇప్పుడు అక్కడ కూడా ఉండకుండా ఒంటరిగా ఉంటుంది. అయితే ఒంటరిగా ఉంటున్నానన్న మనస్తాపం చెంది ఈ నెల 20వ తేదీన పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కోడలు భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ ఆర్.అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లా ఖోఖో అసోసియేషన్ నూతన కార్యవర్గం
జిల్లా ఖోఖో అసోసియేషన్ నూతన కార్యవర్గం


